KCR: కేసీఆర్ పొలం బాట.. కరీంనగర్‌కు పయనం..
ABN, Publish Date - Apr 05 , 2024 | 11:52 AM
Telangana: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించేందుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి అమర వీరుల స్థూపం వద్ద పార్టీ అధినేతకు గులాబీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. భారీ కాన్వాయ్‌తో కేసీఆర్‌కు స్వాగతం పలికి ఆయన వెంట కరీంనగర్‌కు పయనమయ్యారు.
హైదరాబాద్, ఏప్రిల్ 5: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించేందుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (Former Chief Minister KCR) శుక్రవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి అమర వీరుల స్థూపం వద్ద పార్టీ అధినేతకు గులాబీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. భారీ కాన్వాయ్‌తో కేసీఆర్‌కు స్వాగతం పలికి ఆయన వెంట కరీంనగర్‌కు (Karimangar) పయనమయ్యారు.
Raghurama Krishnaraju: ఏ పార్టీ సభ్యత్వం తీసుకున్నా.. మరుక్షణమే నా ఎంపీ సీటు పోతుంది
కరీంనగర్ జిల్లా ముక్ధుంపూర్ గ్రామంలో సాగునీరు లేక ఎండిపంటల పొలాలను మాజీ ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. ఆపై రైతులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 1:00 గంటలకు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో భోజనం చేసి 2:00 గంటలకు బోయినపల్లి మండలంలో ఎండి పోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. అనంతరం 3 గంటలకు మిడ్‌మానేరు రాజరాజేశ్వర జలాశయాన్ని పరిశీలిస్తారు. తరువాత సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో 4:00 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మీడియా సమావేశంలో కేసిఆర్ ఓ కీలక ప్రకటన చేయనున్నట్లు బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.
Nara Lokesh: శాంతి స్వరూప్ మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది..
బీఆర్‌ఎస్ శ్రేణుల ఆందోళన...
కాగా.. సాగునీరందక పొలాలు ఎండుతుంటే రైతన్నలను కలిసి పరామర్శించి వారి కష్టసుఖాలు తెలుసుకునేందుకు కేసీఆర్ ‘‘పొలం బాట’’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో పర్యటించి ఎండిన పంట పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శించనున్నారు. బోయినపల్లి, వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో పర్యటించి సాగునీటి సమస్యలను తెలుసుకుంటారు. అయితే కేసీఆర్ పొలంబాట కార్యక్రమాన్ని ప్రకటించగానే కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో బీఆర్‌ఎస్ నాయకులు, శ్రేణులు జిల్లాల్లో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి కరువుకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ నేతలు కలెక్టర్‌ను కలిసి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్పించారు. చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని రామడుగు, గంగాధర మండలాల్లో పంట పొలాలు ఎండి పోతున్నాయని, సాగునీటి సమస్యను పరిష్కరించాలని, ఎండిన పొలాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కరీంనగర్-నిజమాబాద్ రహదారిపై ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ పార్టీ మాజీ మంత్రి, పెద్దపల్లి ఎంపీ అభ్యరి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లిలో 36 గంటల రైతు నిరసన దీక్షను చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
Andhra Pradesh: వైసీపీ ముఖ్య నేతకు బీజేపీ లీడర్ సీరియస్ వార్నింగ్..
Shanti Swaroop: మూగబోయిన తొలి తెలుగు న్యూస్ రీడర్ స్వరం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...
Updated Date - Apr 05 , 2024 | 11:54 AM