ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress vs BRS: డబ్బా కొట్టుడు ఆపండి.. రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు ఫైర్

ABN, Publish Date - Nov 02 , 2024 | 03:45 PM

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు డబ్బా కొట్టుకుంటున్నారని, వారు చెప్పే 50 వేల ఉద్యోగాలు గత ప్రభుత్వంలోనే నోటిఫై చేసి..

Harish and Revanth

ఎన్నికల హామీల అమలు విషయంలో రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలను కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో 1,61,000 పోస్టులను భర్తీ చేసినప్పటికీ, ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు డబ్బా కొట్టుకుంటున్నారని, వారు చెప్పే 50 వేల ఉద్యోగాలు గత ప్రభుత్వంలోనే నోటిఫై చేసి, పరీక్షలు నిర్వహించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసినవేనని, ఎన్నికల కోడ్ కారణంగా నియామకపత్రాలు అందించడం ఆలస్యమైందన్నారు. పెండింగ్‌లో ఉన్న నియామక పత్రాలు ఇచ్చి, ఉద్యోగాలన్నీ తామే భర్తీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.


హామీలపై ప్రశ్నల వర్షం..

కాంగ్రెస్ పార్టీ మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటివరకు కేవలం పది శాతం ఉద్యోగాలను ఇవ్వలేదన్నారు. 2023 డిసెంబరు 9వ తేదీకి రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా, అర్హులైన రైతుల్లో సగం మందికి రుణమాఫీ కాలేదని, కర్షకులు ఇంకా రుణమాఫీ డబ్బుల కోసం వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రతి నెలా రూ. 4,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చినా, 11 నెలల తర్వాత కూడా అమలు చేయలేదన్నారు. 18 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు ఆ పథకం ఆచరణలోకి రాలేదని తెలిపారు. ప్రతి విద్యార్థికి రూ. 5 లక్షలతో విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని హరీష్‌రావు ప్రశ్నించారు. ప్రతి పంటకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి, సన్న రకాలకు మాత్రమే పరిమితం చేశారని ఆరోపించారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం హామీ ఉసేలేదన్నారు. కళాశాల విద్యార్థినులకు ఎలక్ట్రిక్ వాహనాల హామీ గుర్తు లేదా అన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పారని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 300 రోజులు గడిచినా హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీష్‌రావు విమర్శించారు.


గత పథకాలపై..

కొత్త పథకాల సంగతి దేవుడెరుగు, గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన అన్ని పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, కేసీఆర్ కిట్, పోషక కిట్, ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్, బతుకమ్మ చీరలు.. ఇలా ఎన్నో పథకాల అమలును ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. ఇచ్చిన హామీల అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందనే విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ మాత్రం తమ వైఫల్యాలను విజయాలుగా చూపించేందుకు విఫల యత్నాలు చేస్తూ దేశ ప్రజలను మభ్యపెడుతున్నారని హరీష్‌రావు విమర్శించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 02 , 2024 | 03:45 PM