BRS: పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నాం: కేటీఆర్
ABN, Publish Date - May 22 , 2024 | 12:24 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడయాతో మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు., 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం అవుతున్నాయన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు, 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం అవుతున్నాయన్నారు. పదేళ్లు కనిపించని కరెంట్ (Current) కోతలను చూస్తున్నామని, విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలు, కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్‌ఫార్మర్లు, ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నామన్నారు. సాగునీరు లేక ఎండిన పంట పొలాలను చూస్తున్నామని, ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు, చుక్కనీరు లేక బోసిపోయిన చెరువులు, పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు, రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు, తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితి, పదేళ్ల తరువాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నామని కేటీఆర్ అన్నారు.
చివరికి ఇవాళ జోగిపేటలో విత్తనాల కోసం రైతుల మొక్కులు చూస్తున్నామని, క్యూలైన్‌లో పాసుబుక్కులు, కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదని, ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి (ఫోటో గ్యాలరీ)
మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన్న వెంకన్న
ఫ్యాన్ పార్టీకి సీఈసీ చెక్..
అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే పిన్నెల్లి..
అమిత్ సా వ్యాఖ్యాలపై కేజ్రీవాల్ ఆగ్రహం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 22 , 2024 | 12:24 PM