ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: ఇంత నీతిమాలిన రాజకీయం ఎందుకు?.. ఎక్స్‌లో కేటీఆర్..

ABN, Publish Date - Sep 15 , 2024 | 10:02 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారకరామారావు కాంగ్రెస్ నేతలపై ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) మాజీ మంత్రి కె.తారకరామారావు (Ex Minister KTR) కాంగ్రెస్ నేతలపై (Congress Leaders) ఎక్స్ (X) వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతలను (BRS leaders) కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ (Tweet) చేశారు. ‘‘అతి తెలివి మంత్రి గారు.. మీ లాజిక్ ప్రకారం మీ చిట్టినాయుడు కూడా ఇంకా టీడీపీలోనే ఉన్నారా? లేక కాంగ్రెస్‌లో ఉన్నారా ?.. సరే మీ మాటే నిజం అనుకుందాం ఒక్క నిమిషం కోసం.. మరి మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టు తిరిగి వారికీ కాంగ్రెస్ కండువాలు కప్పిన సన్నాసి ఎవరు?.. సిగ్గులేకుండా ఇంత నీతిమాలిన రాజకీయం ఎందుకు ?.. అసలు చేర్చుకోవడం ఎందుకు, ఆ తర్వాత పదవులు పోతాయి అన్న భయంతో ఈ నాటకాలు ఎందుకు ?.. మీరు ప్రలోభపెట్టి చేర్చుకున్న వాళ్ళను మా వాళ్ళు అని చెప్పుకోలేని మీ బాధను చూస్తే జాలి కలుగుతోంది.. మీరు మీ అతితెలివితో హైకోర్టును మోసం చేద్దాం అనుకుంటున్నారు కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.


అబద్దాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలపై చిన్నచూపు చూస్తోందని, ఒకటో తేదీన జీతాలు అన్నారు. ఇదేనా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. జీతాలు సమయానికి ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు గడిచేది ఎట్లా? అని నిలదీశారు. గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యానికి రక్షణ లేదని, వారి ప్రాణాలకు భరోసా లేదని, ఇప్పుడు జీతాలు సమయానికి ఇవ్వకుండా గురుకుల ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడేస్తారా? అంటూ తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచిందని, ఏనాడైనా ఒక్క రోజు విద్యా శాఖ మీద రివ్యూ చేశారా?.. సకాలంలో వేతనాలు రాకపోతే గురుకుల ఉద్యోగులకు నెల గడిచేది ఎలా? అంటూకేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


కాగా ‘‘రాష్ట్రంలో రోజుకో అంశంతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరిచి డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారు.. ఇందులో భాగంగానే తమ ఎమ్మెల్యేలపై దాడులూ చేయిస్తున్నారు’’ అని కాంగ్రెస్‌ సర్కార్‌పై కేటీఆర్‌ ధ్వజమెత్తారు. శాంతిభద్రతలను కాపాడలేని అసమర్ధ, చేతకాని సీఎం రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. శనివారం అమెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చిన కేటీఆర్‌.. కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అరికెపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి మధ్య వివాదం, కౌశిక్‌రెడ్డి ఇంటిపై గాంధీ అనుచరుల దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 9 నెలలుగా హెడ్‌లైన్‌ మేనేజ్‌మెంట్‌ నడుస్తోందని విమర్శించారు. హామీల అమలును దాటవేస్తూ పాలకులు గారడీ మాటలు చెబుతున్నారని విమర్శించారు.


పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేయాలన్న కౌశిక్‌రెడ్డి మాటల్లో తప్పేముందని ప్రశ్నించారు. కోర్టు తీర్పు వస్తే తమ పదవులు పోతాయని పార్టీ మారిన ఎమ్మెల్యేలు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆ భయంతోనే రేవంత్‌రెడ్డికి తొత్తులుగా ఉన్న వారు తమపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి వంటి దౌర్భగ్యపు, చరిత్రహీన సీఎంను గతంలో ఎప్పుడూ చూడలేదని, పోలీసుల ఎస్కార్ట్‌తో ఓ ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పాల్పడతారా? ఇదెక్కడి దుష్ట సంప్రదాయమని మండిపడ్డారు.


‘‘ఉమ్మడి ఏపీ సీఎంలుగా పని చేసిన చంద్రబాబు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డినే మేము ఎదుర్కొన్నాం. వారితో పోలిస్తే నువ్వు చాలా చిన్నోడివి.. చిట్టినాయుడు, బుల్లి అబ్బాయి వంటి వాడివి.. పదవి ఎవరికీ శాశ్వతం కాదు’’ అని రేవంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి ఘటనలో పోలీసులనూ వదిలిపెట్టమని, న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారని చెప్పుకొన్న రేవంత్‌.. హైకోర్టు తీర్పు తర్వాత మాట మార్చారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రజలందరూ తమ వాళ్లేనని కేటీఆర్‌ స్పష్టం చేశారు.


తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు ఒక్క ప్రాంతీయ విద్వేష ఘటన చోటు చేసుకోలేదని గుర్తు చేశారు. అందుకే హైదరాబాద్‌ ప్రజలు తమను కడుపునిండా ఆశీర్వదించారన్నారు. దీంతో హైదరాబాద్‌ ప్రజలపై సీఎం రేవంత్‌రెడ్డి పగపట్టారని, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హైడ్రాను తీసుకొచ్చి ఆగమాగం చేస్తున్నాడని దుయ్యబట్టారు.

Updated Date - Sep 15 , 2024 | 10:02 AM

Advertising
Advertising