ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vinay Bhaskar: కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలి.. బీఆర్ఎస్ నేత వార్నింగ్

ABN, Publish Date - Sep 15 , 2024 | 09:46 PM

కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యుల సవాల్‌కు సామరస్యంగా సమాధానం అధికార పార్టీ సభ్యులు చెప్పాలని అన్నారు.

వరంగల్: కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యుల సవాల్‌కు సామరస్యంగా అధికార పార్టీ సభ్యులు సమాధానం చెప్పాలని అన్నారు. సమాధానం అడిగితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుండాల్లా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. అదృష్టం కొద్దీ నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచారని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.


ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి రాజకీయ బ్రోకర్ అని ఆరోపణలు చేశారు. పైరవీలతో పబ్బం గడుపుకున్న చరిత్ర రాజేందర్ రెడ్డిదని విమర్శించారు. ఎన్నికలప్పుడు నామినేషన్ వేసి డబ్బులు దండుకున్న చరిత్ర ఆయనదని అన్నారు. నామినేషన్ వేసి సొంత పార్టీ నేతలను బ్లాక్ మెయిల్ చేసే చరిత్ర ఆయనదని దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపణలు చేశారు.


మాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే స్థాయి రాజేందర్ రెడ్డికి లేదని చెప్పారు. ఉద్యమకారుల గురించి మాట్లాడే చరిత్ర రాజేందర్ రెడ్డికి లేదని చెప్పారు. కేటీఆర్‌ను విమర్శిస్తే చూస్తూ ఉరుకోమని మందలించారు. రాజేందర్ రెడ్డి దోపిడి చరిత్ర త్వరలోనే బయటపడుతుందని దాస్యం వినయ్ భాస్కర్ చెప్పారు.


ఇప్పటికైనా రాజేందర్ రెడ్డి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. పొన్నాల లక్ష్మయ్య దగ్గర ఎన్ని పైరవీలు చేశావో తెలుసునని అన్నారు. ఎన్ని కాంట్రాక్టులు పొందావో త్వరలో బయట పెడతానని వినయ్ భాస్కర్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Serilingampally MLA: అరెకపూడి గాంధీ నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు

MP Etala: అన్ని రాష్ట్రాలు సమగ్ర కులగణన చేపట్టాలి..

TPCC: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరణ..

For MoreTelangana NewsandTelugu News.

Updated Date - Sep 15 , 2024 | 10:12 PM

Advertising
Advertising