ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: నాన్‌స్టాప్‌గా చేరికలు.. కాంగ్రెస్‌లోకి మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

ABN, Publish Date - Jul 13 , 2024 | 10:00 AM

Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే దాదాపు ఆరుమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా.. ఆ సంఖ్య మరింత పెరుగుతోంది.

BRS MLA Arikapudi Gandhi to join Congress

హైదరాబాద్, జూలై 13: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) ఒక్కొక్కరుగా కాంగ్రెస్ (Congress) బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా.. ఆ సంఖ్య మరింత పెరుగుతోంది. నిన్న (శుక్రవారం) బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ (MLA Prakash Goud) కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. నేడు మరో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ (MLA Arikapudi Gandhi) హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరికలు ఇంతటితో ఆగనట్లు కనిపిస్తోంది. మరికొంత మంది కూడా బీఆర్‌ఎస్‌ను వీడిన వారి బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది.

CM Chandrababu: హరే కృష్ణ గోకుల్ క్షేత్రానికి చేరుకున్న సీఎం చంద్రబాబు..


కాంగ్రెస్ గూటికి గాంధీ

ఈరోజు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో పార్టీలో గాంధీ చేరనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు జూబ్లిహిల్స్‌లోని సీఎం నివాసంలో ఎమ్మెల్యే... కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అరికపూడి గాంధీతో పాటు పలువురు కార్పోరేటర్లు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అలాగే రేపు (ఆదివారం) ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రావు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.


ఇవి కూడా చదవండి..

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ లేనట్టే?

Lavanya: రాజ్ తరుణ్ - లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఆత్మహత్య లేఖ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 13 , 2024 | 12:08 PM

Advertising
Advertising
<