TG Politics: మమ్మల్ని వేధిస్తున్నారు.. సభలో కేటీఆర్..!
ABN, Publish Date - Aug 02 , 2024 | 03:08 PM
ప్రతిపక్ష సభ్యులను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. తమ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారన్నారు.
ప్రతిపక్ష సభ్యులను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. తమ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారన్నారు. పోస్టులు డిలీట్ చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని కేటీఆర్ శాసనసభలో తెలిపారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలను కాపాడటంలో రాజీపడబోమని, ఎవరిపై వేధింపులు ఉండబోవని శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పగా.. దీనిపై కేటీఆర్ స్పందించారు. తాము లేవనెత్తిన కొన్ని అంశాలపై మంత్రి స్పందించలేదన్నారు. ఐపీసీ స్థానంలో తీసుకొచ్చిన కొత్త న్యాయచట్టాలపై కర్ణాటక, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు కొన్ని సవరణలు తీసుకొచ్చాయని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి సవరణలు తీసుకురావడం లేదన్నారు. కేంద్రం తెచ్చిన చట్టాలపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలన్నారు. సవరణలు చేసే ఉద్దేశం ఉంటే ఎప్పుడు ఆ బిల్లు తీసుకొస్తారో సభకు తెలియజేయాలని కేటీఆర్ కోరారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు, చర్యలకు వ్యతిరేకంగా నిరహరదీక్షలు చేయడం కూడా కొత్త చట్టాల ప్రకారం నేరమని.. అలాంటి చట్టాల్లో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
CM Revanth: త్వరలోనే స్పోర్ట్స్ పాలసీ...
ప్రభుత్వ వైఖరిపై కేటీఆర్..
తెలంగాణలో పోలీసుల వైఖరిని కేటీఆర్ తప్పుబట్టారు. వివిధ ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలపై అనధికార ఒత్తిడి, బలప్రయోగం సరికాదన్నారు. చట్టాలను ప్రభుత్వం దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. ఇటీవల పౌరహక్కుల సంఘం నాయకులు హైదరాబాద్‌లోని ఓ హాలులో సమావేశం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదని.. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కేటీఆర్ సూచించారు. అసెంబ్లీ హాల్‌లో ఫోటోలు, వీడియోలు తీయడంపై కేటీఆర్ స్పందిస్తూ.. పార్లమెంట్‌లో గతంలో కాంగ్రెస్ ఎంపీలు ఫోటోలు, వీడియోలు తీసిఉండొచ్చన్నారు. ఈ వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఖండించారు. పార్లమెంట్, అసెంబ్లీలో ఫోటోలు, వీడియోలు తీయడం పూర్తిగా నిషేధమని, అలాంటి చర్యలకు పాల్పడితే స్పీకర్‌కు చర్యలు తీసుకునే అధికారం ఉందన్నారు. తాను మాట్లాడేటప్పుడు మంత్రులు రన్నింగ్ కామెంట్రీ చేయడం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు. ఎవరైనా ఫోటోలు, మార్ఫింగ్ చేస్తే చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో అధికారపక్షం మరింత బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.
CM Revanth Reddy: రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
కేటీఆర్ వ్యాఖ్యలపై స్పీకర్..
కేటీఆర్ వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించారు. రెండు రోజుల క్రితం అసెంబ్లీ హాల్‌లో తీసిన వీడియో పంపిస్తానని.. ఆది సహేతుకమైన చర్య కాదన్నారు. అలా వీడియో మార్ఫింగ్ చేసి ప్రచారం చేయడం దుర్మార్గపు చర్యగా, దుశ్చర్యగా స్పీకర్ పేర్కొన్నారు. సభకు సంబంధించిన అంశాలను ఇలా మార్ఫింగ్ చేయడం సరికాదన్నారు. ఆ వీడియో సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, వీడియో చూసిన తర్వాత మీరు మాట్లాడాలంటూ కేటీఆర్‌కు స్పీకర్ సూచించారు.
Hyderabad: ‘మంద కృష్ణమాదిగ ఉద్యమ ఫలితమే ఎస్సీ వర్గీకరణ’
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Telangana News and Latest Telugu News
Updated Date - Aug 02 , 2024 | 03:35 PM