ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS: కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాధవరం కృష్ణారావు స్ట్రాంగ్ కౌంటర్

ABN, Publish Date - Dec 26 , 2024 | 11:00 AM

Telangana: కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సినీపరిశ్రమను చెన్నారెడ్డి తమిళనాడు నుంచి హైదారాబాద్ నగరానికి తీసుకొచ్చారని తెలిపారు. సినీ పరిశ్రమలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. హైదారాబాద్ నగర ప్రజలు ప్రశాంతతను కోరుకొంటున్నారన్నారు.

MLA Madhavaram Krishna rao

హైదరాబాద్, డిసెంబర్ 26: ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (MLA Madhavaram Krishan Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. ఎమ్మెల్యేలు శిక్షణ తరగతుల్లో నేర్చుకుంది ఇదేనా అని ప్రశ్నించారు. సినీపరిశ్రమను చెన్నారెడ్డి తమిళనాడు నుంచి హైదారాబాద్ నగరానికి తీసుకొచ్చారని తెలిపారు. సినీ పరిశ్రమలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. హైదారాబాద్ నగర ప్రజలు ప్రశాంతతను కోరుకొంటున్నారన్నారు. నగర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా మాట్లాడితే ఊరుకునేదిలేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు.


కాగా.. ఇటీవల అల్లు అర్జున్‌పై నిజామాబాద్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ సినీ పరిశ్రమకు వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. పుష్పా 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోతే.. వారి కుటుంబాన్ని ఎవరూ పరామర్శించలేదని మండిపడ్డారు. అలాగే ఆమె కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే ఎవరూ కూడా వెళ్లలేదన్నారు. కానీ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదలైన వెంటనే ఆయన ఇంటికి సినీ ప్రముఖులు క్యూ కట్టారన్నారు.

చిరంజీవి లేకుండానే సీఎంతో.. ఎవరెవరంటే


ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారని.. కానీ ఆయన మాటలను అల్లు అర్జున్ వక్రీకరిస్తున్నారని అన్నారు. అలాగే పుష్ప సినిమా గురించి కూడా ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. అదో స్మగ్లర్ సినిమా అని.. సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అల్లు అర్జున్ ఆంధ్రా వ్యక్తివి అని.. అక్కడి నుంచి బతకడానికి వచ్చావంటూ వ్యాఖ్యలు చేశారు. మరోసా ఇలా చేస్తే నీ సినిమాలను ఆడనివ్వమంటూ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.


ఇవి కూడా చదవండి...

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

నేడు కర్ణాటకకు రేవంత్.. విషయం ఇదే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 26 , 2024 | 11:00 AM