Telangana: ఆ పదవి ఇస్తే వెంటనే కాంగ్రెస్‌లో చేరుతా: మల్లారెడ్డి
ABN, Publish Date - Jul 30 , 2024 | 08:43 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అంటూ బహిరంగంగానే ప్రకటించారు. అయితే, ఆయనో చిన్న కండీషన్ పెట్టారు. ఆ కండీషన్‌కు అంగీకరిస్తేనే కాంగ్రెస్‌లో చేరుతానని.. లేదంటే చేరబోనని ప్రకటించారు.
హైదరాబాద్, జులై 30: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అంటూ బహిరంగంగానే ప్రకటించారు. అయితే, ఆయనో చిన్న కండీషన్ పెట్టారు. ఆ కండీషన్‌కు అంగీకరిస్తేనే కాంగ్రెస్‌లో చేరుతానని.. లేదంటే చేరబోనని ప్రకటించారు. మరి ఇంతకీ మల్లారెడ్డి పెట్టిన కండిషన్ ఏంటి? ఇంతకీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మల్లారెడ్డిని కాంగ్రెస్‌లోకి రానిస్తారా? అసలు మల్లారెడ్డి నిజంగానే ఈ ఆఫర్ ఇచ్చారా? లేక ఫన్నీగా మాట్లాడారా? పూర్తి వివరాలు మీకోసం..
అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి మల్లారెడ్డి మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ వార్తలకు తగ్గట్లుగానే మల్లారెడ్డి ప్రవర్తన కూడా ఉంటుంది. ఏనాడూ ఆయన ఈ వార్తలను ఖండించిన దాఖలాలు కూడా లేవు. తాజాగా.. దానికి కొనసాగింపు అన్నట్లుగా బిగ్ కామెంట్ చేశారు మల్లారెడ్డి. పార్టీ మారే అంశంపై బహిరంగంగానే ప్రకటించేశారు.
తనకు హోంమంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు మల్లారెడ్డి ప్రకటించారు. మరి ఇందుకు సీఎం అంగీకరిస్తారా? అని కూడా మల్లారెడ్డి సందేహం వ్యక్తం చేశారు. వందశాతం సీఎం తనను రానివ్వడని కూడా అన్నారు. తనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే మధ్యవర్తిత్వం చేయాలని జర్నలిస్టులను సైతం కోరారు మల్లారెడ్డి. హోంమంత్రి పదవి ఇచ్చేటట్లు సీఎంతో మాట్లాడాలని జర్నలిస్టులను మల్లారెడ్డి కోరారు. బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి గెలిస్తే తతన ప్లేస్ వేరే లెవెల్‌లో ఉంటుండేనని అన్నారు. తాము మూడోసారి గెలిస్తే ఖచ్చితంగా హోంమంత్రి అవుతుండేనని అన్నారు.
మల్లన్న మాస్ ముచ్చట్లు..
‘బీఆర్ఎస్ మూడోసారి గెలిస్తే.. రాష్ట్ర హోంమంత్రి అవుతుండే. సంవత్సరానికి నాలుగు సినిమాలు తీసేవాడిని. కొత్త శాటిలైట్ ఛానెల్ పెట్టేవాడిని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రి పదవి సీఎం దగ్గర ఉంది. కాంగ్రెస్ హోం ఇవ్వనిది ఎలా? వాళ్లు ఇవ్వకుండా నేను గుంజుకోలేను కదా. శాసనసభలో నన్ను ఎవరూ టచ్ చేయడం లేదు. నన్ను టచ్ చేస్తే ఒక్కొక్కరి సంగతి చెప్తాను. అప్పటి దాకా నా నోటికి తాళం వేసుకుని ఉంటాను. నా ఇంట్లో ఇన్‌కమ్ ట్యాక్స్ తనిఖీలు చేసిన అధికారులే షాక్ అయ్యారు. ఒక్క రూపాయి కూడా ఐటీ వాళ్లకు దొరకలేదు. డబ్బులు ఏమయ్యాయి అని నోరెళ్లబెట్టారు. ఇండియాలో మల్లారెడ్డి ఒక్కడే ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిపై ఎఫ్ఐఆర్ చేయించింది. ఒక అధికారిపై కేసు పెట్టాలంటే దమ్ము ఉండాలి.’ అని చెప్పారు మల్లారెడ్డి.
Also Read:
బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
గొడవ మధ్యలో రీల్.. వైరల్ అవుతున్న వీడియో
శ్రీలంకదే టాస్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?
For More Telangana News and Telugu News..
Updated Date - Jul 30 , 2024 | 08:48 PM