Sabita: ఇదేనా ప్రజాస్వామ్యం.. పాలన ఎటుపోతుంది?
ABN, Publish Date - Jul 16 , 2024 | 01:42 PM
Telangana: ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులు కార్యక్రమాలు చేస్తున్నారని.. అధికారులు వారిని స్టేజి మీద కూర్చోబెడున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... పార్టీ కండువాలు కప్పుకుని ఓడిన అభ్యర్థులు చెక్కులు పంపిణీ చేస్తున్నారన్నారని సబిత అన్నారు.
హైదరాబాద్, జూలై 16: ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులు కార్యక్రమాలు చేస్తున్నారని.. అధికారులు వారిని స్టేజి మీద కూర్చోబెడున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (BRS MLA Sabita Indra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... పార్టీ కండువాలు కప్పుకుని ఓడిన అభ్యర్థులు చెక్కులు పంపిణీ చేస్తున్నారన్నారని సబిత అన్నారు.
DK Aruna: మార్గదర్శకాల పేరుతో మమ అనిపించే ప్రయత్నం...
ప్రతిపక్ష ఎమ్మేల్యేలు రివ్యూ చేస్తే వచ్చే అధికారులను సస్పెండ్ చేస్తున్నారని తెలిపారు. ‘‘ఇదేనా ప్రజాస్వామ్యం.. పాలన ఎటువైపు పోతుంది’’ అని ప్రశ్నించారు. ప్రజల పక్షాన పోరాడితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తమ హక్కులను పరిరక్షించాలని స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఇలా జరక్కుండా చూడాలని విజ్ఞప్తి చేశామని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ నేత పద్మారావు అన్నారు. ప్రారంభాలకు, చెక్కుల పంపిణీకి ఓడిన అభ్యర్థులను అనుమతి ఇస్తున్నారన్నారు. మరి ఓడిన అభ్యర్థులను అసెంబ్లీలోకి కూడా అనుమతిస్తారా అని స్పీకర్‌ను అడిగినట్లు తెలిపారు.
Big Breaking: విద్యుత్ కమిషన్ జడ్జిని మార్చాలి: సుప్రీంకోర్ట్
కాగా... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో స్పీకర్‌ను పార్టీ ఎమ్మెల్యేలు కలిసి వినతిపత్రం సమర్పించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఎమ్మెల్యేలు వినతి పత్రం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
Drugs Case: డ్రగ్స్ కేసులో ఏ6గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు
YSRCP: గుడివాడలోని వైసీపీ కార్యాలయం ఖాళీ..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jul 16 , 2024 | 01:45 PM