KTR: రేవంత్ ఈగో చల్లబడింది..
ABN , Publish Date - Dec 30 , 2024 | 04:27 PM
KTR: పుష్ప 2 చిత్రం ప్రీ ప్రిమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం హైదరాబాద్‌లో స్పందించారు.
హైదరాబాద్, డిసెంబర్ 30: పుష్ప 2 చిత్రం ప్రీ రిలీజ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. సోమవారం అమరావతిలో మీడియాతో పవన్ కల్యాణ్ చిట్ చాట్ చేశారు. ఈ సందర్బంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుతోపాటు.. పుష్ప 2 చిత్ర హీరో అల్లు అర్జున్ అంశంపై ఆయన మాట్లాడారు.
ఈ నేపథ్యంలో ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ.. సినిమా వాళ్లను పిలిపించుకుని.. సీఎం రేవంత్‌రెడ్డి ఇష్యూ సెటిల్ చేసుకున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈగో చల్లబడిందన్నారు. అయితే ఈ వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం మాట్లాడారో తనకు సంబంధం లేదని కేటీఆర్ కుండ బద్దలు కొట్టారు.
డిసెంబర్ 4వ తేదీ రాత్రి పుష్ప 2 చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాల పాలై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో గోటితో పోయే దానిని గొడ్టలి వరకు తెచ్చారని తాను అభిప్రాయపడుతున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
రేవంత్ రెడ్టి చాలా గొప్ప నాయకుడని.. ఆయన కింద నుంచి ఎదిగారని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అలా చేశారని తాను అనుకోవడం లేదన్నారు. రేవంత్ రెడ్డి వీటన్నింటికీ మించిన నాయకుడని... ఎందుకంటే పుష్ప సినిమాకు బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంచేందుకు ఆయన ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు.
Also Read: పేర్ని నాని ఫ్యామిలీకి మళ్లీ నోటీసులు
Also Read: లోక్‌సభలో అడుగు పెట్టిన ప్రియాంక
మరి రేవంత్ రెడ్డిని మనం ఎలా తప్పు బడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇక సినిమా హీరోల పట్ల ప్రజలు ప్రేమ, ఆదరణ చూపుతారన్నారు. అయితే రేవతి మరణించిన నేపథ్యంలో అల్లు అర్జున్ తరఫున ఎవరో ఒకరు బాధితుల నివాసానికి.. వెళ్లి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఈ అంశం ఇంత రచ్చ అయ్యేది కాదని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇక అల్లు అర్జున్ మామగారు చంద్రశేఖర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ వాఖ్యాలపై పవన్ కేటీఆర్ స్పందించాలని కోరగా.. ఆయనపై విధంగా స్పందించారు.
For Telangana News And Telugu News