KTR : ఇలాంటి బెదిరింపులకు భయపడం
ABN, Publish Date - Dec 26 , 2024 | 12:04 PM
Telangana: బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్‌పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. . ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపై కక్షగట్టి అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారన్నారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున ఎర్రోళ్ల ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 26: బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ (BRS Leader Errolla Srinivas) అరెస్ట్‌పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ మేరకు గురువారం కేటీఆర్ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపై కక్షగట్టి అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారన్నారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున ఎర్రోళ్ల ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీలను అటకెక్కించి, ఏడో గ్యారెంటీగా "ఎమర్జెన్సీ"ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక.. నిర్బంధం, అణచివేతతో బీఆర్ఎస్ గొంతునొక్కే విఫలయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోజురోజుకూ పెరిగిపోతున్న నేరాల నియంత్రణలో పూర్తిగా చేతిలెత్తేసి, ప్రధాన ప్రతిపక్షాన్ని ఎలా నియంత్రించాలనే దానిపైనే సర్వశక్తులు ఒడ్డుతున్నారన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ను వెంటనే విడుదల చేయాని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులతో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలని చూసే విష సంస్కృతికి చరమగీతం పాడాలని హితవుపలికారు. బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదని.. అరెస్టులు అంత కన్నా కాదన్నారు. ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి బెదిరింపు చర్యలకు భయపడే వారెవరూ లేరని కేటీఆర్ స్పష్టం చేశారు.
Narayana: పుష్ప హీరోయిన్ ఆవేదన ఆదర్శం కావాలి
ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్
కాగా.. బీఆర్‌ఎస్ నేత, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు తెల్లవారుజామునే వెస్ట్ మారెడ్‌పల్లిలోని ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెళ్లారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డితో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేయగా.. ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు నోటీసు ఇచ్చేందుకు ఆయన నివాసానికి వెళ్లారు పోలీసులు. పోలీసులు వచ్చినప్పటికీ బీఆర్‌ఎస్ నేత ఇంట్లో నుంచి బయటకు రాలేదు. అనంతరం శ్రీనివాస్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఆపై అతడిని అరెస్ట్ చేశారు. ఎర్రోళ్ళ నివాసం నుంచి మాసబ్‌ట్యాంక్ పోలీస్‌స్టేషన్‌కు ఆయనను తరలించారు.
కౌశిక్ రెడ్డికి నోటీసులు
ఇటీవల.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయనను కోర్టుకు తరలించగా.. ఎమ్మెల్యేకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరుకావాల్సిందిగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు రావాల్సిందిగా నిన్న (బుధవారం) కౌశిక్ రెడ్డికి మాసబ్‌ట్యాంక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దురుసుగా ప్రవర్తించారంటూ బంజారాహిల్స్ ఎస్సై ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాసబ్ ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు విచారణకు రావాల్సిందిగా కౌశిక్ రెడ్డికి నోటీసులు కూడా ఇచ్చారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో పోలీసులతో ఎర్రోళ్ల శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారంటూ ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా ఆయనను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి...
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
నేడు కర్ణాటకకు రేవంత్.. విషయం ఇదే..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Dec 26 , 2024 | 12:23 PM