RJ Shekhar: జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఆర్జే శేఖర్ బాషాపై కేసు నమోదు
ABN, Publish Date - Aug 08 , 2024 | 09:52 AM
Telangana: ఆర్జే శేఖర్ బాషాపై కేసు నమోదు అయ్యింది. నటి లావణ్యపై దాడి చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు శేఖర్‌పై కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌లో డిబేట్ అనంతరం లావణ్యపై ఆర్జే శేఖర్ రెచ్చిపోయాడు. లావణ్యను బూతులు తిడుతూ దాడి చేశాడు. దీంతో శేఖర్ దాడి చేయడంపై బాధితురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైదాచాబాద్, ఆగస్టు 8: ఆర్జే శేఖర్ బాషాపై (RJ Shekhar Basha) కేసు నమోదు అయ్యింది. నటి లావణ్యపై దాడి చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు (Juilee Hills Police) శేఖర్‌పై కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌లో డిబేట్ అనంతరం లావణ్యపై ఆర్జే శేఖర్ రెచ్చిపోయాడు. లావణ్యను బూతులు తిడుతూ దాడి చేశాడు. దీంతో శేఖర్ దాడి చేయడంపై బాధితురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కడుపు మీద తన్ని చేతికి గాయం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. శేఖర్ బాషాతో తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో శేఖర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు సెక్షన్ 74 115(2) బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు.
Botcha Satyanarayana: పదవులు వస్తుంటాయ్.. పోతుంటాయ్
కాగా.. హీరో రాజ్ తరుణ్ ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ లావణ్య జులై 5న నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వీరి వార్త తీవ్ర సంచలనం సృష్టించింది కూడా. అయితే ఈ ఇద్దరి వివాదంలోకి ఆర్జే శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చారు. లావణ్యపై పలు ఆరోపణలు గుప్పించారు. మస్తాన్ సాయి అనే వ్యక్తితో లావణ్యకు శారీరక సంబంధం ఉందని, అలాగే ఆమెకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని సంచలన కామెంట్స్ చేశారు. అమాయకులైన యువతులకు కూడా ఆమె మత్తుపదార్థాలు అలవాటు చేసిందని ఆర్జే శేఖర్ ఆరోపించారు.
Vinesh Phogat: వినేశ్ ఫొగట్‌పై కుట్ర జరిగిందా?
దీనిపై ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌లో డిబేట్ జరిగింది. ఈ క్రమంలో లావణ్య, శేఖర్ బాషా మధ్య తీవ్ర చర్చ జరిగింది. ఇందులో భాగంగా శేఖర్ బాషా ఆమెపై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా ఆగ్రహానికి గురైన లావణ్య ఒక్కసారిగా అతడిపై చెప్పుతో దాడి చేసింది. దీంతో శేఖర్ తీవ్ర ఆగ్రహానికి గురియ్యారు. ఈ ఘటనతో ఇంటర్వ్యూ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వీరి గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గామారింది. అనంతరం శేఖర్ భాషాపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై శేఖర్ విచక్షణారహితంగా దాడి చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో పోలీసులు శేఖర్‌పై కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి...
Delhi: కోచింగ్ సెంటర్లలో అధికారుల తనిఖీలు
AP News: విశాఖలో ఎన్నికలకు నో బ్రేక్.. ఈసీ గ్రీన్ సిగ్నల్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 08 , 2024 | 09:55 AM