Kavitha: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ స్పెషల్ కోర్టు వార్నింగ్.. అసలేం జరిగిందంటే..!?
ABN, Publish Date - Apr 15 , 2024 | 03:35 PM
BRS MLC Kavitha: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కోర్టు ప్రాంగణంలో మీడియాతో కవిత మాట్లాడంపై.. ఆమె తరపు న్యాయవాది మోహిత్‌రావును సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ప్రశ్నించారు. బెయిల్ పిటిషన్ దాఖలు సమయంలో కవిత న్యాయవాది మోహిత్‌రావును న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన కవిత లాయర్.. మీడియా అడిగితే మాట్లాడారని న్యాయమూర్తికి వివరించారు..
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (MLC Kavitha) సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కోర్టు ప్రాంగణంలో మీడియాతో కవిత మాట్లాడంపై.. ఆమె తరపు న్యాయవాది మోహిత్‌రావును సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ప్రశ్నించారు. బెయిల్ పిటిషన్ దాఖలు సమయంలో కవిత న్యాయవాది మోహిత్‌రావును న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన కవిత లాయర్.. మీడియా అడిగితే మాట్లాడారని న్యాయమూర్తికి వివరించారు. ‘ కవిత ఏం చెప్పాలనుకున్నా.. విచారణ సమయంలో సీబీఐకి చెప్పాలి. అంతేకానీ ఇలా కోర్టు ఆవరణలో మాట్లాడటం మంచిది కాదు. మీ క్లయింట్‌కవితకు అలా మాట్లాడవద్దని వివరంగా చెప్పండి. ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే కోర్టు బయట మాట్లాడాలి తప్ప.. కోర్టు ఆవరణలో, కారిడార్లలో మాట్లాడవద్దని ఆ విధంగా సూచించండి’ కవిత లాయర్ మోహిత్‌రావుకు న్యాయమూర్తి ఆదేశించారు. ఇవన్నీ నిశితంగా విన్న మోహిత్ రావు.. సూచనలన్నింటినీ కవితకు చెబుతానని న్యాయమూర్తికి తెలిపారు.
సీబీఐ కాదు.. బీజేపీ!
కోర్టుకు వచ్చేముందు మీడియాతో మాట్లాడిన ప్రతీసారి దర్యాప్తు సంస్థలు, బీజేపీ గురించి ఏదో ఒకటి కవిత మాట్లాడుతూనే ఉన్నారు. ఇవాళ కూడా.. కవిత మాట్లాడుతూ ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. బీజేపీ నేతలు బయట మాట్లాడుతున్న విషయాలనే లోపల అధికారులు తనను ప్రశ్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అడిగిన విషయాన్నే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని మీడియా ముఖంగా సీబీఐపై కవిత మండిపడ్డారు. కవిత ఇలా మాట్లాడటాన్ని సీబీఐ స్పెషల్ సీరియస్‌గా తీసుకుని పైవిధంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
మళ్లీ కస్టడీ.. జైలుకే!
కాగా.. రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కవిత బెయిల్ పిటిషన్‌పై దర్యాప్తు సంస్థ సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 20 లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా.. కవిత బెయిల్ పిటిషన్‌పై ఈనెల 22 ఉదయం 11గంటలకు విచారణ జరుపుతామన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా వెల్లడించారు. కవితకు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌజ్ అవెన్యూలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించాలని సీబీఐ కోరగా.. కోర్టు 9 రోజుల కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో కవితను మరోసారి సీబీఐ అధికారులు తీహార్ జైలుకు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Apr 15 , 2024 | 03:44 PM