ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bandi sanjay: దాని వెనుకనున్న మతలబేంటో సీఎం బయటపెట్టాలి

ABN, Publish Date - Dec 25 , 2024 | 02:56 PM

Bandi sanjay:హీరో అల్లు అర్జున్ ఇష్యూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. దీని వెనుకనున్న మతలబేంటో బయట పట్టాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Central Mnister Bandi Sanjay

హైదరాబాద్, డిసెంబర్ 25: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌కి కాంగ్రెస్ పార్టీ చేసిన పాపం పోవాలంటే.. లోక్‌సభలో ప్రతి పక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ పంచ తీర్థాలు తిరగాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడు కానీ వీరు చేసిన పాపం పోదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అయితే అంబేద్కర్ విగ్రహాన్ని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పెట్టారని అంతా అంటున్నారని.. ఇది ప్రజల నగదుతో ఏర్పాటు చేసిందని వివరించారు.

బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో వాజపేయ్ శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. హీరో అల్లు అర్జున్ ఇష్యూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించాల్సిన అవసరం అయితే లేదన్నారు. దీని వెనుక ఉన్న మతలబేంటో బయట పట్టాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.


టాలీవుడ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లితే.. తెలంగాణకు నష్టం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యల వల్ల తెలంగాణకు నష్టం జరిగే విధంగా ఉందని.. వారిని అదుపులో పెట్టుకోవాలని పార్టీ అధిష్టానానికి బండి సంజయ్ సూచించారు. మరోవైపు కిషన్ రెడ్డి జాతీయ అధ్యక్షుడు అయితే సంతోషమేనని ఈ సందర్భంగా బండి సంజయ్ పేర్కొన్నారు. ఇక మాజీ ప్రధాని వాజపేయ్ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.


భారత మాజీ ప్రధాని వాజపేయ్ శత జయంతి వేడుకలు బుధవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతోన్నాయి. ఢిల్లీలోని వాజపేయ్ శత జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ఆయన కేబినెట్ సహచరులతోపాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు పాల్గొన్నారు. మరోవైపు ఈ రోజు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సమావేశమయ్యాయి.


ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల ప్రతిపక్షాలు తమ ఆందోళనలను ఉధృతం చేశాయి. ఇంకోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడి మార్పు జరుగుతోందని.. గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. అదీకాక జేపీ నడ్డా అధ్యక్ష పదవి కాలం ఇప్పటికే పూర్తయింది.


అయితే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన్ని ఆ పదవిలోనే కొనసాగించారు. ఆయా అసెంబ్లీ ఎన్నికలు సైతం పూర్తయ్యాయి. దీంతో అధ్యక్ష మార్పుపై సైతం ఈ సమావేశంలో చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమిస్తారంటూ ఓ ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. దీనిపై బండి సంజయ్ పై విధంగా స్పందించారు.

For Telangana News And Telugu News

Updated Date - Dec 25 , 2024 | 02:56 PM