ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bandi Sanjay: వారిని స్వయంగా కేసీఆరే పంపుతున్నారు... చేరికలపై బండి హాట్ కామెంట్స్

ABN, Publish Date - Jul 12 , 2024 | 01:46 PM

Telangana: బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌‌లోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ చేరికలకు సంబంధించి కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వయంగా కేసీఆర్.. సొంత ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి పంపుతున్నారని అన్నారు.

Central Minister Bandi Sanjay

హైదరాబాద్, జూలై 12: బీఆర్‌ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్‌‌లోకి (Congress) చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ చేరికలకు సంబంధించి కేంద్రమంత్రి బండి సంజయ్ (Central Minister Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. స్వయంగా కేసీఆర్ (Former CM KCR).. సొంత ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి పంపుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల ఏకైక గ్యారంటీ నరేంద్ర మోదీ అని తెలిపారు. అవినీతి నుంచి బయట పడేందుకు కాంగ్రెస్‌‌కు కేసీఆర్ సహకరిస్తున్నారని ఆరోపించారు.

CM Chandrababu: ప్రజలను చూసి కాన్వాయ్ ఆపిన సీఎం చంద్రబాబు


సెక్యూరిటీ లేకుండా.. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని సవాల్ విసిరారు. నిరుద్యోగులను పోలీసుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేస్తోందని కేంద్ర మంత్రి మండిపడ్డారు. రాహుల్ గాంధీని సొంత పార్టీ వారే ప్రధాని అభ్యర్థిగా అంగీకరించలేదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలకు పెద్ద పీఠ వేస్తుందన్నారు. బీజేపీ కార్యకర్తల గెలుపే రాష్ట్ర బీజేపీ నాయకత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీతో తెలంగాణ ప్రజలు మోసపోయారన్నారు.

Danam Nagender: త్వరలో బీఆర్ఎస్‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం... దానం షాకింగ్ కామెంట్స్


కాంగ్రెస్‌ను ప్రజలు వ్యతిరేకించారనటానికి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా నరేంద్ర మోదీ మాత్రమే గ్యారంటీ అంటున్నారన్నారు. ధర్మం, తెలంగాణ పేదల కోసం పోరాడేది బీజేపీ మాత్రమే అని చెప్పుకొచ్చారు. బీజేపీ కార్యకర్తల పోరాటం వలనే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 8సీట్లు వచ్చాయన్నారు. రైతులను మోసం చేసే విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందన్నారు.


ఇవి కూడా చదవండి..

BJP: బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశాలు.. ఏం చర్చిస్తారంటే?

Gudivada Amarnath: ‘తల్లికి వందనం’ పథకంపై అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 12 , 2024 | 01:52 PM

Advertising
Advertising
<