ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth: డ్రగ్స్‌‌ విషయంలో సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్

ABN, Publish Date - Jul 16 , 2024 | 08:02 PM

డ్రగ్స్ నియంత్రణపైముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ నియంత్రణ పైన పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న విదేశీయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

CM Revanth Reddy

హైదరాబాద్: డ్రగ్స్ నియంత్రణపైముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ నియంత్రణ పైన పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డ్రగ్స్ విక్రయిస్తున్న విదేశీయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ నగర శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలెక్టర్లు, ఎస్పీ తెలంగాణ సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మానవ అక్రమ రవాణా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో పీస్ కమిటీలను పునరుద్ధరించాలని చెప్పారు.బాధితుల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి.. క్రిమినల్స్‌తో కాదని స్పష్టం చేశారు.


 ALSO Read: CM Revanth Reddy: అటవీ సంపదపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

డ్రంకన్ డ్రైవ్ తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా ఉండాలని అన్నారు. హైదరాబాద్ నగరంలో రాత్రి పూట ఫుడ్ కోర్ట్‌ల విషయంలో ఇబ్బంది రానివ్వొద్దని సూచించారు. నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.  ఎవరో చెబితే  కలెక్టర్లు,ఎస్పీలకు పోస్టింగ్‌లు ఇవ్వలేదని, సమర్థత ఆధారంగా నిర్ణయం తీసుకున్నామని తేల్చిచెప్పారు.

కలెక్టర్లు తప్పని సరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందేనని హుంకుం జారీ చేశారు.డీజీపీ  నుంచి కానిస్టేబుల్ వరకు ఫిజికల్ పోలీసింగ్ నిర్వహించాలని సూచించారు. రైతు రుణమాఫీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని వివరించారు.రుణమాఫీ అమలుపైన కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పారు. నిర్లక్ష్యం కారణంగా ఏ ఒక్క రైతుకు నష్టం జరగొద్దని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన

Kodanda Reddy: బీఆర్ఎస్ పాఠాలు నేర్పాలని చూస్తోంది: కాంగ్రెస్ నేత కోదండరెడ్డి

Adi Srinivas: బెదిరించి చేర్చుకుంటే ఆధారాలు చూపెట్టండి: ప్రభుత్వ విప్ శ్రీనివాస్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 16 , 2024 | 09:30 PM

Advertising
Advertising
<