ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: ఖబర్దార్ తెల్చుకుందాం రండి... కిషన్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి మాస్ సవాల్

ABN, Publish Date - Dec 03 , 2024 | 06:34 PM

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెస్తారో కిషన్‌రెడ్డి చెప్పాలని అడిగారు. తాగునీటి ప్రాజెక్టులకు రూ.7 వేల కోట్లు కావాలి.. ఎన్ని తెస్తారో చెప్పాలని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

హైదరాబాద్: ఢిల్లీ సహా పలు నగరాలు కాలుష్య కాసారంగా మారాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మరో పదేళ్లు విస్మరించామంటే హైదరాబాద్‌ కుడా అలాగే అవుతుందని చెప్పారు. వాన పడితే రోడ్లన్నీ వరదమయం అవుతున్నాయని చెప్పారు. రోడ్ల పక్కన వాటర్‌ హార్వెస్టింగ్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో వర్షానికి ట్రాఫిక్‌ నరకం లేకుండా ప్రణాళికలు చేస్తున్నట్లు వివరించారు. చెరువులు, నాలాలు, కుంటల ఆక్రమణదారులకు హైడ్రాతో భయం పట్టుకుందని అన్నారు. మెట్రోకు రూ.35 వేల కోట్లు అవసరం అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.


ఎన్ని నిధులు తెస్తారో కిషన్‌రెడ్డి చెప్పాలి...

రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు రూ.35 వేల కోట్లు కావాలని చెప్పారు. మెట్రో, రీజనల్ రింగ్‌ రోడ్డుకు ఎన్ని నిధులు తెస్తారో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటో చెప్పాలని నిలదీశారు. మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెస్తారో కిషన్‌రెడ్డి చెప్పాలని అడిగారు. తాగునీటి ప్రాజెక్టులకు రూ.7 వేల కోట్లు కావాలి.. ఎన్ని తెస్తారో చెప్పాలని ప్రశ్నించారు. మూసీలో నిద్రపోతారో.. మోదీని తీసుకువస్తారో.. వాళ్ల ఇష్టం అని చెప్పారు. తెలంగాణకు మాత్రం కిషన్‌రెడ్డి నిధులు సాధించాలని అన్నారు. తమకు పేరు వస్తుందని కొందరు ఏడుస్తున్నారని మండిపడ్డారు. ఏడ్చే వాళ్ల గురించి తమకు బాధలేదని చెప్పారు. హైదరాబాద్‌ మునిగిపోతే మోదీ ఒక్క పేసా కూడా ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


పలు అభివృద్ధి పనుల ప్రారంభం

హైదరాబాద్‌ నగరంలో రైజింగ్‌ పేరుతో ఇవాళ(మంగళవారం) "ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు' నిర్వహించారు. హైదరాబాద్‌లో పలు అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. గ్రేటర్‌ పరిధిలో పలు సుందరీకరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.3,500 కోట్లతో రహదారి అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.16.50 కోట్లతో నిర్మించిన భూగర్భ సంపుల ప్రారంభించారు. గ్రేటర్ పరిధిలో రూ.150 కోట్లతో పలు సుందరీకరణ పనులు చేపట్టారు. సీఎం చేతుల మీదుగా దేశంలోనే అతిపెద్ద ఎస్టీపీ ప్రారంభించారు. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ చేపట్టబోయే 6 జంక్షన్ల అభివృద్ధికి సీఎం శంకుస్థాపన చేశారు. 7 ఫ్లైఓవర్లు, అండర్‌ పాసులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు భద్రత కిట్లను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు.


ప్రపంచంతో హైదరాబాద్‌ పోటీ ..

గతేడాది డిసెంబర్‌ 3నే ప్రజాపాలనకు ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రపంచంతో హైదరాబాద్‌ పోటీ పడుతుందని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. న్యూయార్క్‌, టోక్యోతో సమానంగా నగరాన్ని నడిపిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. రూ.7వేల కోట్లతో హైదరాబాద్‌ నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్ల తెలిపారు. ఎస్టీపీలు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్త సాంకేతిక అభివృద్ధిలో హైదరాబాదీల పాత్ర ఉందన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఫార్మా కంపెనీలు కాంగ్రెస్‌ హయాంలోనే వచ్చాయని వివరించారు. నగరంలో తాగునీటి సమస్యను తీర్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. ఎన్టీఆర్, కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి నిర్ణయాలతోనే నగరాభివృద్ధి చెందిందని అన్నారు. వైఎస్‌ హయాంలోనే హైదరాబాద్‌కు మెట్రో ప్రతిపాదన వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు.


రీజనల్‌ రింగ్‌ రోడ్డు తెలంగాణకు మణిహారం..

అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంతో ఐటీ, రియల్‌ కంపెనీలు వచ్చాయన్నారు. ఇన్నర్‌, ఔటర్‌ రింగ్ రోడ్లు వేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని చెప్పారు. రూ.38 వేల కోట్లతో నిర్మించే రీజనల్‌ రింగ్‌ రోడ్డు తెలంగాణకు మణిహారమని అన్నారు. ఢిల్లీ సహా పలు నగరాలు కాలుష్య కాసారంగా మారాయని చెప్పారు. మరో పదేళ్లు విస్మరించామంటే హైదరాబాద్‌ కుడా అలాగే అవుతుందన్నారు. వాన పడితే రోడ్లన్నీ వరదమయం అవుతున్నాయన్నారు. రూ.లక్షన్నర కోట్లు ఖర్చుపెడితే హైదరాబాద్‌ అద్భుత నగరం అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రోడ్ల పక్కన వాటర్‌ హార్వెస్టింగ్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో వర్షానికి ట్రాఫిక్‌ నరకం లేకుండా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. చెరువులు, నాలాలు, కుంటల ఆక్రమణదారులకు హైడ్రాతో భయపడుతున్నారన్నారు. అభివృద్ధి చేస్తే కాంగ్రెస్‌కు పేరు వస్తుందని బీఆర్‌ఎస్‌ ఏడుస్తుందని విమర్శించారు. మూసీ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నాయో బీజేపీ, బీఆర్‌ఎస్‌ చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ, హైదరాబాద్‌కు కిషన్‌రెడ్డి ఏమి తెచ్చారని నిలదీశారు. గుజరాత్‌కు మోదీ నిధులు తీసుకెళ్తుంటే.. కిషన్‌రెడ్డి గుడ్లప్పగించి చూస్తున్నారని ధ్వజమెత్తారు. మూసీ పునరుజ్జీవనాన్ని కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.


హైదరాబాద్‌ అభివృద్ధిపై మంత్రివర్గ ఉపసంఘం..

చిత్తుశుద్ధి ఉంటే మూసీ అభివృద్ధికి కిషన్‌రెడ్డి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిధులు తెస్తారో.. గుజరాత్‌కు వలస వెళ్తారో కిషన్‌రెడ్డి చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిలదీశారు. మెట్రోకు రూ.35 వేల కోట్లు అవసరం అవుతాయన్నారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు రూ.35 వేల కోట్లు కావాలని తెలిపారు. తాగునీటి ప్రాజెక్టులకు రూ.7 వేల కోట్లు కావాలి.. ఎన్ని తెస్తారో చెప్పాలన్నారు. మూసీలో నిద్రపోతారో.. మోదీని తీసుకువస్తారో.. వాళ్ల ఇష్టమన్నారు.. తెలంగాణకు మాత్రం నిధులు సాధించాలన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. డిప్యూటీ సీఎం నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని అన్నారు. మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నారని వివరించారు. రాష్ట్రాభివృద్ధిపై ఉపసంఘానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రతిపాదనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మేధావులు కూడా రాష్ట్రాభివృద్ధి కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఏం చేసినా.. అడ్డుకుంటాం అంటే ఓప్పుకోమని హెచ్చరించారు. ఎస్టీపీలు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ప్రపంచ వ్యాప్త సాంకేతిక అభివృద్ధిలో హైదరాబాదీల పాత్ర ఉందన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఫార్మా కంపెనీలు కాంగ్రెస్‌ హయాంలోనే వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

BRS: కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర కామెంట్స్

MLA: ‘పది’ విద్యార్థులకు బంపరాఫర్ ఇచ్చిన ఎమ్మెల్యే.. అదేంటో తెలిస్తే..

Pushpa‌ 2: పుష్ప 2 టికెట్ ధరలు పెంపుపై హైకోర్టులో విచారణ.. ఏం జరిగిందంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 03 , 2024 | 07:00 PM