CM Revanth Reddy: టూరిజం పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు
ABN, Publish Date - Dec 06 , 2024 | 09:46 PM
టూరిజం పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత పదేళ్లలో తెలంగాణకు ప్రత్యేక టూరిజం పాలసీ తయారు చేయలేదని అన్నారు. ఇవాళ(శుక్రవారం) తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూరిజం పాలసీపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్: టూరిజం పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత పదేళ్లలో తెలంగాణకు ప్రత్యేక టూరిజం పాలసీ తయారు చేయలేదని అన్నారు. 31డిసెంబర్ లోగా తెలంగాణ నూతన టూరిజం పాలసీ తయారు చేయాలని స్పష్టం చేశారు. ఇవాళ(శుక్రవారం) తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూరిజం పాలసీపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దుబాయ్, సింగపూర్, చైనా దేశాలను అధ్యయనం చేయాలని సూచించారు. దుబాయ్, సింగపూర్ తరహా షాపింగ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని తెలిపారు. హైదరాబాద్ వాతావరణం 365 రోజులు బాగుంటుందని.. దానికి అనుగుణంగా టూరిజాన్నీ అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తమిళనాడు తరహా ఆటోమొబైల్ పరిశ్రమ హైదరాబాద్ లో అభివృద్ధి అయ్యేలా చూడాలని చెప్పారు. టైగర్ రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాల్లో పర్యాటకులు పెరిగేలా చూడాలని అన్నారు. టైగర్ రిజర్వు ఫారెస్ట్ లను దేవాలయాలతో కనెక్ట్ చేయాలని సూచించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పులులు తెలంగాణ వైపు వచ్చే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పల్ల టెంపుల్ టూరిజం పెరిగిందని అన్నారు. రోటిన్ టూరిజం కాకుండా కాన్సెప్ట్ టూరిజం పైన దృష్టి సారించాలని అన్నారు. ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు పైన అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ఎయిర్ ఫోర్ట్ నుంచి 20 నిమిషాల్లో మెగా కన్వెన్షన్ సెంటర్ కు చేరుకునేలా ఉండాలని సూచించారు. డెస్టినేషన్ వెడ్డింగ్ లకు అనువైన ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేయాలన్నారు. పర్యాటక శాఖ స్థలాల లీజులపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. టూరిజం స్థలాలు, లీజులపైన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. లీజు ముగిసినా ఖాళీ చేయని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కోర్టు కేసులను సీరియస్ గా తీసుకోని స్టే లు ఎత్తివేసే లా చూడాలని స్పష్టంచేశారు. అడ్వకేట్ జనరల్ తో చర్చించి మంచి న్యాయవాదులను ఏర్పాటు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు..
మంచి గుర్తింపు ఉన్న కంపెనీలకు పర్యటక స్థలాలు లీజ్ కు ఇవ్వాలని సూచించారు. తెలంగాణలో టూరిజం అభివృద్ధి కి మంచి అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఎయిర్ ఫోర్ట్ నుంచి మూడు గంటల్లో తెలంగాణలో ఎక్కడికైనా చేరుకోవచ్చని అన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలు బాగున్నాయని.. గ్రామీణ రోడ్లు బాగున్నాయి...అన్ని రకాల ఆహారం దొరుకుతుందని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిని ఖాళీ చేయించి మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఛార్మినార్ కు పర్యాటకులు పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
అసెంబ్లీలో నూతన టూరిజం పాలసీని ప్రవేశ పెట్టి సమగ్రంగా చర్చ జరిగేలా చూద్దామన్నారు. సొంత కాళ్ల పైన నిలబడేలా టూరిజం శాఖ కసరత్తు చేయాలని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న టూరిజం పాలసీలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, టూరిజం శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, టూరిజం శాఖ ఎండీ ప్రకాష్ రెడ్డి, సీఎంవో ఓస్డీ వేముల శ్రీనివాసులు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Congress: అస్థిరత నుంచి సుస్థిరత దాకా
CM Revanth Reddy: కేసీఆర్! ప్రతిపక్ష నేతగా.. నీ డ్యూటీ చెయ్
KTR: రేవంత్ ప్రతిష్టిస్తోంది.. తెలంగాణ తల్లినా.. కాంగ్రెస్ తల్లినా
Read Latest Telangana News And Telugu News
Updated Date - Dec 06 , 2024 | 09:55 PM