CM Revanth Reddy: టీ-ఫైబర్ డీపీఆర్ ఆమోదించాలని కేంద్ర మంత్రిని కోరిన రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Aug 23 , 2024 | 05:47 PM
టీ-ఫైబర్ డీపీఆర్ ఆమోదించాలంటూ కేంద్ర కమ్యునికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia)ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కోరారు. ఢిల్లీ పర్యటనలో ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు.
ఢిల్లీ: టీ-ఫైబర్ డీపీఆర్ ఆమోదించాలంటూ కేంద్ర కమ్యునికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia)ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కోరారు. ఢిల్లీ పర్యటనలో ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ మేరకు టీ-ఫైబర్(T-Fiber) ద్వారా గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్‌వర్క్ కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు.
టీ-ఫైబర్ ద్వారా తెలంగాణలోని 65వేల ప్రభుత్వ కార్యాలయాలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో 63లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30లక్షల ఇళ్లకు నెలకు కేవలం రూ.300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. టీ-ఫైబర్ అమలుకు గానూ జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ (ఎన్ఎఫ్ఓఎన్) మొదటి దశ మౌలిక సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వానికి త్వరగా అందించాలని జ్యోతిరాదిత్య సింధియాకు విజ్ఞప్తి చేశారు. ఎన్ఎఫ్ఓఎన్ మొదటి దశ నుంచి భారత్ నెట్ మూడో దశకు మార్చడానికి పంపించిన డీపీఆర్‌ను ఆమోదించాలని సీఎం కోరారు. భారత్ నెట్ ఉద్యమి ప్రోత్సాహక పథకాన్ని టీ-ఫైబర్‌కు వర్తింపజేయాలని విన్నవించారు. టీ-ఫైబర్ కోసం రూ.1,779కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు.
మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అధిష్ఠానం పెద్దలను కలవనున్నారు. తెలంగాణ "ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ" (పీసీసీ) నూతన అధ్యక్ష పదవితోపాటు, మంత్రి వర్గ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను సైతం కలుస్తున్నారు. దీని కోసం గురువారం రాత్రే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్సీలతో కలిసి ఆయన బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: ఈనెల 25న నాగోల్ మెట్రోస్టేషన్ వద్ద మహాధర్నాకు పిలుపు..
Ponguleti Srinivas: నా ఇల్లు అక్రమమైతే మీరే కూల్చేయండి.. కేటీఆర్‌కు పొంగులేటి సవాల్
Venuswami: వేణుస్వామి గురించి సంచలన విషయాలు వెలుగులోకి..!