ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth: వాళ్లను ఇబ్బందిపెడితే వదలను.. సీఎం రేవంత్ వార్నింగ్

ABN, Publish Date - Nov 11 , 2024 | 11:20 AM

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు బంద్‌ అయ్యాయి. సోమవారం నుంచి కొనుగోలు కేంద్రాలకు తాళం వేస్తామని తెలంగాణ కాటన్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. నిరవధిక సమ్మె దిశగా జిన్నింగ్‌, ప్రెస్సింగ్‌ మిల్లర్లు అడుగులు వేస్తున్నారు. మిల్లర్లు సమ్మె ప్రకటించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది.

హైదరాబాద్: తెలంగాణలో పత్తి జిన్నింగ్ మిల్లర్లు సమ్మె ప్రకటించిన నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీసీఐ సీఎండీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. సమ్మె కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా, పత్తిని తక్కువ ధరలకు అమ్మాల్సిన పరిస్థితి తలెత్తకూడదని, పత్తి జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు జరిపి, పత్తి కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. రైతులు ఇబ్బందులకు గురికాకుండా, కష్టాలు పడకుండా పత్తిని తక్కువ ధరలకు విక్రయించాల్సిన అవసరం లేకుండా చర్యలు వెంటనే తీసుకోవాలని సూచించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటమే ముఖ్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.


ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చూడాలి.. సీఎం రేవంత్ ఆదేశాలు

మరోవైపు.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ESMA) కింద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు దృష్టికి రావటంతో ముఖ్యమంత్రి స్పందించారు. వెంటనే సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ మాట్లాడారు. రైతులు పండించిన పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడటం, రైతులను గందరగోళానికి గురి చేయటం, రైతులను వేధించటం లాంటి సంఘటనలపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రమంతటా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.


పత్తి రైతులను వీడని కష్టాలు...

అయితే.. పత్తి రైతులను కష్టాలు వీడటం లేదు. ఇప్పటికే మద్దతు ధర దక్కక ఇబ్బంది పడుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా తేమ శాతంపై నిబంధనలు పెట్టడడంతో నామమాత్రంగా కొనుగోళ్లు సాగుతున్నాయి. జిన్నింగ్‌ మిల్లుల యజమానులు తాము సోమవారం నుంచి పత్తిని కొనుగోళ్లు నిలిపివేస్తున్నామని మార్కెట్‌ అధికారులకు ఆదివారం సాయంత్రం నోటీస్‌ ఇచ్చారు. అప్పటికే రైతులు సోమవారం మార్కెట్‌కు తీసుకొచ్చేందుకు వాహనాల్లో నింపారు. ఇప్పుడు కొనుగోళ్లు నిలిపివేయడంతో పత్తి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పత్తి కొనుగోళ్లు నిలిపివేత...

జిన్నింగ్‌ మిల్లుల్లో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు మిల్లర్లు మార్కెట్‌ అధికారులకు ఆదివారం నోటీస్‌ అందజేశారు. ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 పేరిట సీసీఐ కఠిన నిబంధనలు పెడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని మిల్లర్లు నోటీసులో తెలిపారు. ఒక మిల్లుకు కేటాయించిన పత్తి పూర్తిగా వచ్చిన తర్వాతనే మరో మిల్లుకు పత్తి పంపిస్తామని సీసీఐ అధికారులు అంటున్నారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకుంటే తర్వాత మిల్లులకు పత్తి తగ్గుతుందని, అలా చేయడం వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో జిన్నింగ్‌ మిల్లుల్లో కొనుగోళ్లకు రాష్ట్ర స్థాయి బంద్‌‌కు పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగానే సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

Tiger: ఆ మూడు జిల్లాల ప్రజలను వణికిస్తున్న పెద్దపులి..

Ponnam Prabhakar: కేటీఆర్‌కు మంత్రి పొన్నం స్ట్రాంగ్ కౌంటర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 11 , 2024 | 11:40 AM