ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: ఢిల్లీలో మేడిగ‌డ్డపై సీఎం రేవంత్ స‌మీక్ష

ABN, Publish Date - Jul 21 , 2024 | 10:23 PM

మేడిగ‌డ్డ బ్యారేజీ మ‌ర‌మ్మతులు, ప‌రీక్షలు, క‌మిష‌న్ విచార‌ణ త‌దిత‌ర‌ అంశాల‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని త‌న‌ అధికారిక నివాసంలో...

న్యూఢిల్లీ/హైదరాబాద్ : మేడిగ‌డ్డ బ్యారేజీ మ‌ర‌మ్మతులు, ప‌రీక్షలు, క‌మిష‌న్ విచార‌ణ త‌దిత‌ర‌ అంశాల‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని త‌న‌ అధికారిక నివాసంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ కార్యద‌ర్శి రాహుల్ బొజ్జ, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ స‌ల‌హాదారు ఆదిత్యనాథ్‌ దాస్‌తో ముఖ్యమంత్రి స‌మావేశమ‌య్యారు. ఈ సందర్భంగా.. ఢిల్లీలో శ‌నివారంనాడు జ‌రిగిన నేష‌న‌ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) స‌మావేశంలో చ‌ర్చకు వ‌చ్చిన‌ అంశాల‌ను ఉత్తమ్‌, అధికారులు.. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా అంశాల‌పై ముఖ్యమంత్రి త‌న అభిప్రాయాల‌ను వారికి తెలియ‌జేశారు. సోమ‌వారం ఢిల్లీలో జ‌ర‌గ‌నున్న ఎన్‌డీఎస్ఏ స‌మావేశంలో అధికారులు, ఇంజినీర్లు స‌మావేశంపై రేవంత్ రెడ్డి ప‌లు సూచ‌న‌లు, సలహాలు చేశారు.


కేంద్రంతో చర్చలు..!

ఇదిలా ఉంటే.. సోమవారం సాయంత్రం 4:00 గంటలకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌లు కలవనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా తెలంగాణలోని అనేక ఇతర పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రితో నిశితంగా చర్చించనున్నారు. అనంతరం సమావేశానికి సంబంధించి వివరాలన్నీ ఉత్తమ్.. మీడియాకు వివరించున్నట్లు సమాచారం.


అప్పుడే కుంగింది..!

ఢిల్లీలో ఎన్‌డీఎస్ఏ సమావేశం అనంతరం శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఉత్తమ్.. కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే మేడిగడ్డ కుంగిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల అమూల్యమైన సొమ్ముతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని మండిపడ్డారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకూడదనే భావిస్తోందన్నారు. కాళేశ్వరం కట్టింది కమీషన్ల కోసమే అని.. లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయిందని ఉత్తమ్ చెప్పుకొచ్చారు. ఇందుకు ప్రతి సంవత్సరం 10 వేల కోట్ల వడ్డీలు కడుతున్నట్లు ఢిల్లీ వేదికగా మంత్రి తెలిపారు.

Updated Date - Jul 21 , 2024 | 10:27 PM

Advertising
Advertising
<