CM Revanth: హరీష్‌రావు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ గట్టి కౌంటర్
ABN, Publish Date - Jul 27 , 2024 | 01:16 PM
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ మధ్య మాటల యుద్ధం నడిచింది. హరీష్‌రావు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని.. ప్రభుత్వం ప్రజల లక్ష్యంగా పని చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఆరు గ్యారంటీలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో కేటాయింపులు పెంచారు.. కానీ అసలు బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించారని విమర్శించారు.
హైదరాబాద్, జూలై 27: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) మధ్య మాటల యుద్ధం నడిచింది. హరీష్‌రావు వ్యాఖ్యలపై రేవంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని.. ప్రభుత్వం ప్రజల లక్ష్యంగా పని చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఆరు గ్యారంటీలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో కేటాయింపులు పెంచారు.. కానీ అసలు బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే డోకా పార్టీగా మారిపోయిందని హరీష్ విమర్శలు గుప్పించారు.
Telangana Assembly: ‘హాఫ్ నాలెడ్జ్.. డమ్మీ’.. అసెంబ్లీలో హరీష్ vs కోమటిరెడ్డి..
ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలతో హరీష్ రావు ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే వారు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. ప్రజలు శిక్షించినా వాళ్ల ఆలోచన మారలేదని... అదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారన్నారు. లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును రూ.7వేల కోట్లకే తెగనమ్మారని మండిపడ్డారు. గొర్రెల స్కీం పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారని... గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరల్లోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆడబిడ్డల సెంటిమెంట్ నూ దోపిడీకి ఉపయోగించుకున్నారన్నారు. కురుమ, యాదవుల సోదరులను అమాయకులను చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారని సీఎం వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ఖర్చు విషయంలోనూ గతంలో ఒకటి చెప్పి... ఇప్పుడు రూ.94వేల కోట్లు అని చెబుతున్నారన్నారు.
Hari Rama Jogaiah: హరిరామ జోగయ్య మళ్లీ స్టార్ట్ చేశారు.. ఈసారి చంద్రబాబును కూడా..
రేవంత్ సవాల్...
‘‘బీఆర్ఎస్ ఎన్ని వేల కోట్ల విలువైన భూములు అమ్మిర్రో లెక్క తీద్దాం..అప్పుల లెక్కలు చెబుతున్నారు... కానీ అమ్ముకున్న లెక్కలు చెప్పడంలేదు.. పదేళ్లయినా పాలమూరుకు చేసిందేం లేదు. 20లక్షల కోట్లకు పైగా ఖర్చుపెట్టినా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం వీళ్లు కాదా? రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చారు. గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా. రంగారెడ్డి జిల్లాపై నిర్లక్ష్యం వహించారు. రంగారెడ్డి జిల్లా ఆస్తులు అమ్ముకున్నారు కానీ జిల్లాకు సాగు నీరు ఇవ్వలేదు. ప్రజలు బీఆర్‌ఎస్‌కు గుండుసున్నా ఇచ్చినా బుద్ధి మారకుండా ఇలా మాట్లాడటం సరైంది కాదు. మీరు నిజాయితీ పాలన అందించి ఉంటే... బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పాలి’’ అంటూ సీఎం సవాల్ విసిరారు.
కేసీఆర్‌కు ఎందుకంత కక్ష
అర్థవంతైనమైన చర్చకు తమకు అభ్యంతరం లేదన్నారు. ఊక దంపుడు ఉపన్యాసాలు, తప్పుడు ప్రచారానికి వేదిక కాదన్నారు. గొర్రెల పేరు మీద రూ.700 కోట్ల అవినీతి జరిగిందని తెలిపారు. ఏసీబీ మీద మీదనే విచారణ చేస్తే రూ.700 కోట్లు అని తేలిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని.. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఏకంగా ఉరి తీశారని.. అయినా వారి తీరు మారలేదన్నారు. పాలమూరు మీద కేసీఆర్‌కు ఎందుకు కక్ష అని ప్రశ్నించారు. అక్కడి ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదన్నారు. రంగారెడ్డి ఆస్తులు, భూములు అమ్ముకున్నారు కానీ చేవెళ్ల ప్రాజెక్ట్‌ను ఎందుకు కట్టలేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇవి కూడా చదవండి...
Hari Rama Jogaiah: హరిరామ జోగయ్య మళ్లీ స్టార్ట్ చేశారు.. ఈసారి చంద్రబాబును కూడా..
Telangana: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్స్ బంద్.. కారణమిదే..!
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jul 27 , 2024 | 01:20 PM