ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jishnudev Varma: నూతన గవర్నర్ జిష్ణుదేవ్‌కు స్వాగతం పలికిన సీఎం రేవంత్

ABN, Publish Date - Jul 31 , 2024 | 03:23 PM

Telangana: శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. బుధవారం త్రిపుర నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న నూతన గవర్నర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాలల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు హర్కార వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

New Governor Jishnudev Varma

హైదరాబాద్, జూలై 31: శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు (Telangana New Governor Jishnudev Varma) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్వాగతం పలికారు. బుధవారం త్రిపుర నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న నూతన గవర్నర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాలల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు హర్కార వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయంలో సాయుధ దళాల గౌరవ వందనాన్ని నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్వీకరించారు.

Suryakumar Yadav: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ఆ ముగ్గురితో సమంగా..


ప్రమాణస్వీకారం...

కాగా... ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ నూతన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగవ గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాదే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ చీఫ్, ప్రతిపక్ష నేత కేసీఆర్, విపక్ష పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.

Chandrababu: చంద్రబాబు రివ్యూలో కబ్జా పర్వంపై ఓపెన్ అయిన అధికారులు


జిష్ణుదేవ్ వర్మ గురించి...

త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఈయన.. ప్రస్తుత ఇంచార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ స్థానంలో రానున్నారు. రాజ కుటుంబానికి చెందిన జిష్ణు దేవ్‌ 1957 ఆగస్టు 15న జన్మించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. 1990 ప్రారంభంలో బీజేపీలో చేరారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. 2018 నుంచి 2023 వరకు ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడిగానూ జిష్ణుదేవ్ వర్మ బాధ్యతలు నిర్వర్తించారు.


ఇవి కూడా చదవండి...

CM Revanth: ‘చీల్చిచెండాడుతా’ అన్న కేసీఆర్‌‌కు స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చిన సీఎం..

TS News: గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత... సీఎం డౌన్ డౌన్ అంటూ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 31 , 2024 | 03:35 PM

Advertising
Advertising
<