ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HYDRA: హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ రాబోతుంది: హైడ్రా కమిషనర్ రంగనాథ్..

ABN, Publish Date - Sep 14 , 2024 | 05:19 PM

హైడ్రా గురించి కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ వచ్చే నెలలో ఆర్డినెన్స్ రాబోతుందని వెల్లడించారు. హైడ్రాపై చాలామంది అనుమానాలు లేవనెత్తున్నారని, కొందరు కోర్టులను కూడా ఆశ్రయించారని గుర్తుచేశారు.

HYDRA Commissioner Ranganath

హైదరాబాద్: హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ లోపు ఆర్డినెన్స్ రాబోతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. చాలా మంది హైడ్రాపై అనేక అనుమానాలు లేవనెత్తున్నారని, కొంతమంది కోర్టులను సైతం ఆశ్రయించారని.. అలాంటి వారికి త్వరలోనే సమాధానం దొరుకుతుందని రంగనాథ్ చెప్పుకొచ్చారు. తెలంగాణ క్యాబినెట్ ఆమోదంతో హైడ్రాకు విశేషాధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ రాబోతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన క్రేడాయ్ సమావేశంలో కమిషనర్ రంగనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు


ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.." తెలంగాణ ప్రభుత్వం జులై 19న జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రాకు చట్టబద్ధత ఉందా, లేదా? అని ఇవాళ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దీనిపై కొంత మంది న్యాయస్థానాలకు సైతం వెళ్లారు. హైడ్రా చట్టబద్ధమైనదే. ఎగ్జిక్యూటివ్ రెజల్యుషన్ ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు. ప్లానింగ్ కమిషన్, క్యాబినెట్ సెక్రటేరియెట్, లా కమిషన్, ఏసీబీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వంటివి ఎన్నో ఎగ్జిక్యూటివ్ రెజల్యుషన్ ద్వారానే ఏర్పాటయ్యాయి. అక్టోబర్ లోపు హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాబోతుంది.


హైడ్రాను చట్టబద్ధం చేసేందుకు తెలంగాణ సర్కార్ పని చేస్తుంది. త్వరలో క్యాబినెట్ ఆమోదంతో దీనికి విశేషాధికారాలు రానున్నాయి. వాల్టా, మున్సిపల్, జీహెచ్ఎంసీ, నీటిపారుదల చట్టాల్లోని విశేషాధికారాలు సైతం హైడ్రాకు వస్తాయి. ఆరు వారాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో హైడ్రా బిల్లు తీసుకురాబోతుంది. మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు హైడ్రా సహకారంగా ఉంటుంది. గ్రే హౌండ్స్, టాస్క్ ఫోర్స్ తరహాలోనే హైడ్రా పని చేస్తుంది" అని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి

Telangana: రెచ్చిపోయిన కేటీఆర్.. సీఎం రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్యలు..

Hyderabad: వామ్మో జ్వరం.. పెరుగుతున్న వైరల్‌ ఫీవర్ల బాధితులు

Telangana: ఎమ్మెల్యే గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు..

CP CV Anand: నిమజ్జనానికి 25వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు: సీపీ సీవీ ఆనంద్..

Updated Date - Sep 14 , 2024 | 05:49 PM

Advertising
Advertising