ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GST Scam: జీఎస్టీ స్కామ్‌పై అసెంబ్లీలో చర్చ.. అరెస్ట్‌‌లు ఖాయమా?

ABN, Publish Date - Jul 29 , 2024 | 02:27 PM

Telangana: కమర్షియల్ ట్యాక్స్ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రూ.1400 కోట్ల స్కామ్‌పై అసెంబ్లీలో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే ఐదు మందిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వ్యవహారంపై సీసీఎస్ పోలీసులు ఇప్పటికే ఆధారాలను సేకరించారు. 75 మంది పన్నులు చెల్లింపుదారులు ..

GST Scam

హైదరాబాద్, జూలై 29: కమర్షియల్ ట్యాక్స్ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రూ.1400 కోట్ల స్కామ్‌పై అసెంబ్లీలో (Telangana Assembly) చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) నిర్ణయించింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే ఐదు మందిపై సీసీఎస్ పోలీసులు (CCS Police) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ (Former CS Somesh Kumar) వ్యవహారంపై సీసీఎస్ పోలీసులు ఇప్పటికే ఆధారాలను సేకరించారు. 75 మంది పన్నులు చెల్లింపుదారులు కార్యకలాపాల వివరాలను నిందితులు ఉద్దేశపూర్వకంగా ఆన్‌లైన్‌లో కనిపించకుండా చేసినట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేతకు నిందితులు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.

Viveka Case: వివేకా కేసులో ప్రధాన సాక్షి సెక్యూరిటీపై హైకోర్టు ఏం చెప్పిందంటే?


కమర్షియల్ ట్యాక్స్ , ఐఐటీ హైదరాబాద్ మధ్య జరిగే లావాదేవీలను కూడా పక్కదారి పట్టినట్లు గుర్తించారు. హైదరాబాద్ ఐఐటీ సాఫ్ట్‌వేర్‌లోని సమాచారాన్ని స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సప్ గ్రూప్‌కు చేరేలా ఆదేశాలు జారీ అయ్యాయని.. ఆ గ్రూప్‌లో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కూడా ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణా బేవరెజస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారా కమర్షియల్ ట్యాక్స్‌కు వేయి కోట్లు నష్టం వాటిన్నట్లు సమాచారం. మరో 11 ప్రైవేటు సంస్థలు రూ.400 కోట్ల వరకు పన్నులు ఎగవేసినట్లు గుర్తించారు. ఈ కేసులో మరికొంత మందికి సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. అసెంబ్లీలో చర్చ తర్వాత అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.


రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కమర్షియల్ ట్యాక్స్‌ స్కామ్‌పై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ -5 నిందితుడిగా సోమేశ్ కుమార్ పేరు చేర్చారు. మాజీ సీఎస్‌‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్‌ ఎ.శివరామ ప్రసాద్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుపై కేసు నమోదు అయ్యింది. సీసీఎస్‌లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కనూరి ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ అయ్యింది.


ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌లో చెల్లింపుల్లో రూ.1000 కోట్లు స్కామ్ జరిగినట్లు ఆరోపణల వచ్చాయి. నకిలీ ఇన్వైస్‌‌లు సృష్టించి నిందితుడు మోసాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. దాదాపు 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించారు. లబ్ది పొందిన కంపెనీల జాబితాలో రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఫోరెన్సిక్‌ అడిట్‌లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. మాజీ సీఎస్‌ సోమేష్ సూచనలతోనే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. స్కామ్‌ పాల్పడ్డ నిందితులపై ఐపీసీ 406,409,120B ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. త్వరలో అధికారులకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు.


ఇవి కూడా చదవండి...

Social Media: చైనాలో ఇండియన్ ఇన్‌ఫ్లూయన్సర్‌ చేసిన వీడియోపై దుమ్మెత్తి పోస్తున్న భారతీయులు

AP Politics: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్ భేటీ

Read Latest Talangana News And Telugu News

Updated Date - Jul 29 , 2024 | 02:31 PM

Advertising
Advertising
<