Harish Rao: రేవంత్ రెడ్డి మీ పాలన మార్పు మార్కు ఇదేనా...
ABN, Publish Date - Dec 05 , 2024 | 10:28 AM
మాజీ మంత్రి హరీష్‌రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకాడుతున్నారని, మళ్ళీ ఉల్టా కేసు బనాయిస్తున్నారని.. ఇదేం విడ్డూరం... ఇదెక్కడి న్యాయం.. ఇదేం ప్రజాస్వామ్యం.. రేవంత్ రెడ్డి పాలన మార్పు మార్కు ఇదేనా అంటూ ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేత (BRS Leader), మాజీ మంత్రి హరీష్‌రావు (Ex Minister Harish Rao).. రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Govt.)పై సోషల్ మీడియా (Social Media) ఎక్స్ (X) వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు (Comments) గుప్పించారు. ‘‘ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకడుతరు, మళ్ళీ ఉల్టా కేసు బనాయిస్తరు.. ఇదేం విడ్డూరం... ఇదెక్కడి న్యాయం.. ఇదేం ప్రజాస్వామ్యం.. రేవంత్ మీ పాలన మార్పు మార్కు ఇదేనా.. రాజ్యాంగాన్ని కాపాడుదామని రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతడు... నువ్వేమో తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూనే ఉంటవు... ప్రజల తరుపున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది లేదు, బెదిరేది లేదు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని, వెంట పడుతూనే ఉంటామని హరీష్ రావు స్పష్టం చేశారు.
ఉద్రిక్తత
మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిదగ్గర పోలీసుల మోహరించారు. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ అధికారుల విధులకు ఆటంకం కల్గించారంటూ కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇదిలా ఉండగా మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డి నివాసానికి మాజీమంత్రి హరీష్ రావు వెళ్లనున్నారు. ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేయకుండా.. కౌశిక్ రెడ్డిపై ఉల్టా కేసు పెట్టారంటూ ఆయన మండిపడ్డారు.
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. కౌశిక్ రెడ్డి
కాగా కొద్ది నెలలుగా సీఎం రేవంత్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి తన మొబైల్ ఫోన్ ట్యాప్ చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశికర్‌రెడ్డి ఆరోపించారు. బుధవా రం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం ప్రోద్భలంతో శివధర్‌రెడ్డి తనఫోన్ ట్యాప్ చేసి డ్రగ్స్ కేసులో ఇరికించాలని ప్రయత్నించారన్నారు. తాను కేసు పెట్టేందుకు బంజారాహిల్స్ ఏసీపీకి ఫోన్ చేస్తే రమ్మన్నారని, తనకు చెప్పిన సమయానికి ముందే ఆయన పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. స్టేషన్‌లో ఉన్న సీఐ తానొక ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా ప్రవర్తించారన్నారు.
ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించి సీఎం, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీపైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కాగా, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బుధవారం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ వద్ద హంగామా సృష్టించారు. తన ఫిర్యాదు తీసుకోవాలని స్టేషన్ నుంచి బయటకు వెళుతున్న ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర వాహనాన్ని అడ్డుకోవడమే కాకుండా దుర్భాషలాడారు. ఈ నేపథ్యంలో విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు: డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ లీలలు
ప్రభుత్వ చర్యలపై లోకాయుక్త సంతృప్తి
బీఫ్ వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 05 , 2024 | 10:28 AM