VH: చెల్లిపై అలాంటి పోస్ట్లు వస్తే జగన్ స్పందించరా?
ABN, Publish Date - Feb 03 , 2024 | 01:27 PM
Andhrapradesh: ‘‘షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురు కాదు’’ అని ఆరోపణలు చేస్తూ వచ్చిన పోస్ట్లపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... తల్లిని, చెల్లిని జగన్ దూరం పెట్టారని.. సొంత చెల్లికి అవమానం జరుగుతుంటే జగన్కు బాధ్యత లేదా అని ప్రశ్నించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 3: ‘‘షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురు కాదు’’ అని ఆరోపణలు చేస్తూ వచ్చిన పోస్ట్లపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (Congress Leader V Hanumanth Rao) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... తల్లిని, చెల్లిని జగన్ దూరం పెట్టారని.. సొంత చెల్లికి అవమానం జరుగుతుంటే జగన్కు (CM Jagan Reddy) బాధ్యత లేదా అని ప్రశ్నించారు. షర్మిల (YS Sharmila), సునీతలపై (YS Sunitha) జగన్కు గౌరవం లేదన్నారు. సొంత చెల్లెళ్ళపై ప్రేమ లేని జగన్ మహిళా సాధికారత అని ముచ్చట్లు చెబుతారని మండిపడ్డారు. షర్మిల రాజశేఖర్ రెడ్డి కూతురు కాదని ఆరోపణలు చేస్తూ పోస్టర్స్ వేస్తుంటే జగన్ సైలెంట్ ఉండడం ఏంటి అని నిలదీశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల అన్నకి సపోర్ట్ చేశారని.. రాజకీయాల కోసం జగన్ ఇంత దిగజారుతారా అంటూ విమర్శించారు. షర్మిలపై ఇలాంటి పోస్టర్స్ వేస్తుంటే బాధగా ఉందన్నారు. ఇప్పటికైనా చెడు సంప్రదాయాలని జగన్ పక్కన పెట్టాలని హితవుపలికారు. పవర్ ఉందని జగన్ ఎగిరెగిరి పడితే ప్రజలు బుద్ది చెప్తారని హెచ్చరించారు.
జగన్ తన సొంత చెల్లెలిపై కక్ష సాధింపు మానుకోవాలన్నారు. సునీత న్యాయం కోసం పోరాడుతోందని తెలిపారు. షర్మిలపై పోస్టర్స్ వేసిన వాళ్లపై జగన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు చెల్లికి అవమానం జరుగుతున్నా జగన్ పట్టించుకోవడం లేదని.. రేపు తల్లికి అవమానం జరిగినా పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల ఏపీకి వెళ్ళగానే జగన్కు భయం పట్టుకుందన్నారు. షర్మిలపై విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనని బెదిరిస్తున్నారని వివేకా కూతురు బాధపడుతోందన్నారు. కాంగ్రెస్ లేకపోతే జగన్ ఎక్కడ ఉండేవారని వి.హనుమంతరావు ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 03 , 2024 | 02:22 PM