ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress: కేసీఆర్ ఏం మాట్లడుతుండో ఆయనకే తెలియాలి.. జీవన్‌రెడ్డి ఎద్దేవా

ABN, Publish Date - Mar 13 , 2024 | 01:04 PM

Telangana: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లడుతుండో ఆయనకే తెలియాలని ఎమెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఖరీఫ్ సాగు నీరు అందకపోవడానికి కేసీఆరే కారణమన్నారు. కరువుకు కేసీఆరే కారణమని విమర్శించారు. మిషన్ భగీరథ ఫెయిల్యూర్ ప్రాజెక్టని అన్నారు. కమిషన్ల కక్కుర్తితోనే మిషన్ భగీరథ ప్రాజెక్టు తీసుకొచ్చారని ఆరోపించారు.

హైదరాబాద్, మార్చి 13: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) ఏం మాట్లడుతుండో ఆయనకే తెలియాలని ఎమెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఖరీఫ్ సాగు నీరు అందకపోవడానికి కేసీఆరే కారణమన్నారు. కరువుకు కేసీఆరే కారణమని విమర్శించారు. మిషన్ భగీరథ ఫెయిల్యూర్ ప్రాజెక్టని అన్నారు. కమిషన్ల కక్కుర్తితోనే మిషన్ భగీరథ ప్రాజెక్టు తీసుకొచ్చారని ఆరోపించారు. ఆ సలహా ఇచ్చిన అధికారిని ఉరి తీయాలని తాను సభలోనే చెప్పానన్నారు. పంటలు తడి ఆరకుండా చూడాలన్నారు. కాళేశ్వరం, యాదాద్రి పవర్ ప్రాజెక్టుపై పవర్ కొనుగోలుపై జ్యూడిషరీ ఎంక్వయిరీ వేయడంతో కేసీఆర్ పరేషన్లో పడ్డారన్నారు. మూడు పిల్లర్లు దెబ్బతింటే ఐపోయిందా అని కేసీఆర్ అంటుండు అని.. గుండె పోయిన తర్వాత మనిషి బతుకుతాడా ? అని ప్రశ్నించారు.

TS News: ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైడ్రామా.. ప్రెస్‌మీట్ నుంచి ఇంట్లోకి తీసుకెళ్లిన బీఆర్ఎస్ నేతలు


‘‘సభకు రాకుండా టీవీ ముందుకు వస్తా అంటుండు. నిన్ను ఎవరైనా అవుతున్నారా? నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ప్రభుత్వమైన ఏర్పడిన 100 రోజుల్లో హామీలను అమలు చేసిన సందర్భం లేదు. బీఆర్ఎస్ 10 ఏళ్లల్లో చెయ్యలేనివి రేవంత్ రెడ్డి మూడు నెలల్లో చేసి చూపారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ కూడా కనుమరుగవుతుందు. భాష గురించి కేసీఆరే మాట్లాడాలి. బీఆర్ఎస్ నేతలకు ఇన్ని రోజులు కేసీఆర్ మాట్లాడితే వినసొంపుగా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే సీసం పోసినట్లు ఉందా? మా పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఢిల్లీ లో ఉంది. సమావేశాలకు వెల్లాల్సిన అవసరం మాకు ఉంటుంది. మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు?’’ అని జీవన్ రెడ్డి నిలదీశారు.

ఇవి కూడా చదవండి...

Mudragada: వైసీపీలో చేరడానికి ముందే ముద్రగడకు మరో అవమానం

Stock Market Updates: 1879 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ మిడ్ క్యాప్..భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 13 , 2024 | 01:06 PM

Advertising
Advertising