Congress: త్వరలోనే రైతులకు తీపి కబురు..: మహేష్ కుమార్
ABN, Publish Date - May 16 , 2024 | 04:31 PM
Telangana: రైతుల కోసం బీఆర్ఎస్ ధర్నాలు చేయడం సిగ్గు చేటని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గత పదేళ్లల్లో రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. రైతులకు సంకెళ్లు వేసింది బీఆర్ఎస్ కాదా అని నిలదీశారు. గజ దొంగల్లా బేడీలు వేశారని.. నేరెళ్ల ఘటన ఎవరి హయాంలో జరిగిందని అన్నారు. రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం గోసపుచ్చుకుందని.. దాన్ని ఎవరు మర్చిపోలేదన్నారు.
హైదరాబాద్, మే 16: రైతుల కోసం బీఆర్ఎస్ (BRS) ధర్నాలు చేయడం సిగ్గు చేటని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (MLC Mahesh Kumar Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గత పదేళ్లల్లో రైతులకు (Farmers) ఏం చేశారని ప్రశ్నించారు. రైతులకు సంకెళ్లు వేసింది బీఆర్ఎస్ (BRS) కాదా అని నిలదీశారు. గజ దొంగల్లా బేడీలు వేశారని.. నేరెళ్ల ఘటన ఎవరి హయాంలో జరిగిందని అన్నారు. రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం గోసపుచ్చుకుందని.. దాన్ని ఎవరు మర్చిపోలేదన్నారు. వరి వేస్తే ఉరి అని కేసీఆర్ (BRS Chief KCR) అన్నారని గుర్తుచేశారు. రైతులను వరి సాగు చెయ్యొద్దని చెప్పి కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో వరి వేయలేదా అని నిలదీశారు. గతం కంటే అదనంగా ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలు తెరిచి కొనుగోళ్లు చేస్తున్నామని ఎమ్మెల్సీ తెలిపారు.
AP Elections: ఏపీ ఫలితాలపై తొలిసారి స్పందించిన సీఎం జగన్
కేసీఆర్ లాగా రైతుల విషయంలో మోసం చేసే సర్కార్ తమది కాదన్నారు. సీఎం రేవంత్ రైతు సంక్షేమ సర్కార్ నడిపిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు సిగ్గు, లజ్జా లేకుండా ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే రైతులకు సీఎం రేవంత్ తీపికబురు చెబుతారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా... సీఎం రేవంత్ సమర్థవంతంగా పాలన సాగిస్తున్నారన్నారు. ధర్నాల పేరుతో రైతులను మరోసారి మోసం చేసే పనిలో పడ్డారని మండిపడ్డారు. యావత్ దేశంలోనే రైతుల ఆత్మహత్యలో రాష్ట్రాన్ని రెండో స్థానానికి తీసుకొచ్చారు కేసీఆర్ అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా నడుస్తోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ డబుల్ డిజిట్ స్థానాలు దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు పాలన చేసిన మోదీ (PM Modi) సెంటిమెంట్‌పైనే ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
Gudivada Amarnath: ‘వన్ సైడ్ విక్టరీ మాదే...మళ్లీ జగనే సీఎం’
Prathipati Pullarao: పల్నాడు హింసకు కారణాల్లో పోలీసుల తీరుపైనే అనుమానాలు
Read Latest Telangana News AND Telugu News
Updated Date - May 16 , 2024 | 04:34 PM