Mahesh kumar: బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ?
ABN, Publish Date - Sep 03 , 2024 | 03:28 PM
Telangana: భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలమయ్యిందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ వున్నారని ప్రశ్నించారు. ప్రజలకు భరోసా ఇస్తూ సర్కార్‌కు సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉండే అని.. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని మండిపడ్డారు. ప్రతిపక్ష పాత్ర పోషించకుంటే ఎలా ? అంటూ నిలదీశారు. రాజకీయాలను పక్కన పెట్టి సాయం చెయ్యాల్సిన సోయి లేదా అంటూ మండిపడ్డారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 3: భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలమయ్యిందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (MLC Mahesh kumar Goud) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ వున్నారని ప్రశ్నించారు. ప్రజలకు భరోసా ఇస్తూ సర్కార్‌కు సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉండే అని.. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని మండిపడ్డారు. ప్రతిపక్ష పాత్ర పోషించకుంటే ఎలా ? అంటూ నిలదీశారు.
AP Politics: జగన్‌కి ఇద్దరు బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..
రాజకీయాలను పక్కన పెట్టి సాయం చెయ్యాల్సిన సోయి లేదా అంటూ మండిపడ్డారు. కేసీఆర్ ఏ ఫామ్ హౌస్‌లో పడుకున్నారో ప్రజలు తెలుసుకునే పనిలో ఉన్నారన్నారు. ‘‘మొన్నటి వరకు కవిత బెయిల్ కోసం కష్టపడ్డారు తండ్రి ఫామ్ హౌస్‌లో ఉంటే కేటీఆర్ ఇగ్లాండ్‌లో రిలాక్స్ అవుతున్నడు. ఇంగ్లాండ్‌లో విహార యాత్రలో ఉండి సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు. కేటీఆర్ సోషల్ రెస్పాన్సబులిటీ మరిచి సోషల్ ట్వీట్‌లు పెడుతున్నారు’’ అంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ వరద బాధితులను ఆదుకోడానికి రోడ్డు మార్గంలో వెళ్లి పర్యటిస్తున్నారని అన్నారు.
నాలుగు రోజులుగా సీఎం, మంత్రులు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారన్నారు. కేటీఆర్‌కు హెలికాఫ్టర్‌ల సోకులు తప్పా మరేం లేదని విమర్శించారు. పసలేని ట్వీట్లు పెడ్తూ కేటీఆర్ విమర్శలు చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు వరద సాయం చేస్తానని చెప్పి అన్ని ఎగొట్టారన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ భీమా కట్టకుండా రైతులను మోసం చేసిన మొనగాడు కేసీఆర్ అంటూ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రాజ్ భవన్ ముందున్న ఎంఎస్ మక్తా నీటమునిగిన కేసీఆర్ గడపదాటి బయటికి రాలేదన్నారు. కేంద్రంతో కూడా సీఎం రేవంత్ మాట్లాడి ఆర్ధిక సాయం కోరారని తెలిపారు. కొన్ని పేపర్లో అడ్డగోలుగా వార్తలు రాస్తున్నారని... వాస్తవాలకు దూరంగా వార్తలు వస్తున్నాయన్నారు.
Ganesh Chaturthi: వినాయక చవితికి ఎలాంటి విగ్రహాన్ని పూజలో ఉంచితే మంచిది? వాటి ఫలితాలు ఎలా ఉంటాయి?
ఏపీలో జగన్‌కు 11 సీట్లు మాత్రమే వచ్చాయని.. అయినా జగన్ ప్రజల్లో ఉన్నారన్నారు. ఇక్కడ కేసీఆర్‌కు 39 సీట్లు వచ్చినా.. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమై ఉన్నారన్నారు. ఇంత విపత్తు వచ్చినా కేసీఆర్, కేటీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సంపాదించుకున్న సొమ్ముని దాచుకునే పనిలో బీఆర్‌ఎస్ నేతలున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరు పనిచేయాలని తెలిపారు. సర్కార్‌కు సపోర్ట్ చేయాలన్నారు. ‘‘సిటీ ఆఫ్ లేక్స్ అంటేనే హైదరాబాద్. మోకీలలో విల్లాలు నీట మునిగినయ్. హైడ్రా న్యాయంగా పనిచేస్తుంది. హైడ్రాకు మేము పూర్తి సపోర్ట్ చేస్తున్నాం’’ అని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టంచేశారు.
ఇవి కూడా చదవండి...
Uttar Pradesh: తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి.. సీఎం ఆదేశాలు
Etela: వరద ప్రాంతాల్లో త్వరలోనే కేంద్ర బృందాలు పర్యటన
Read Latest Telangana News And Telugu News
Updated Date - Sep 03 , 2024 | 04:10 PM