Rahul Gandhi: తెలంగాణలో రైతు రుణమాఫీ.. రాహుల్ గాంధీ కీలక కామెంట్స్..
ABN, Publish Date - Jul 31 , 2024 | 03:50 PM
Rahul Gandhi: తెలంగాణలో ప్రస్తుతం రైతు రుణాల మాఫీ పండుగ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. తెలంగాణలో రైతుల పంట రుణాలను మాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Rahul Gandhi: తెలంగాణలో ప్రస్తుతం రైతు రుణాల మాఫీ పండుగ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. తెలంగాణలో రైతుల పంట రుణాలను మాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తెలంగాణలో మరో ఎన్నికల హామీని నెరవేర్చామని పోస్ట్ చేశారు రాహుల్.
‘తెలంగాణలో రైతులకు మళ్లీ శుభాకాంక్షలు. మన ఎన్నికల హామీ ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రుణ మాఫీ రెండవ విడతను విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం.. రాష్ట్రంలోని 6.4 లక్షల రైతు కుటుంబాలకు రూ. 1.5 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేసి వారిని ఆదుకుంది. ఒక వైపు బీజేపీ దేశవ్యాప్తంగా రైతులను అప్పుల ఊబిలో కూరుకునేలా చేయడమే కాకుండా ఎంఎస్‌పీకి చట్టబద్దత కూడా కల్పించడం లేదు. అందుకు భిన్నంగా కాంగ్రెస్ ప్రతి సందర్భంలోనూ రైతు కుటుంబాలకు సహాయం అందించడానికి కృషి చేస్తుంది. INDIA కూటమి భారత దేశ రైతులకు MSP పైన చట్టపరమైన హామీ ఇచ్చి, రుణ విముక్తులను చేస్తుంది.’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
తెలంగాణలో రైతు రుణమాఫీ ఇలా..
ఎన్నికల హామీలో భాగంగా రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ హామీకి కట్టుబడి.. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా రూ. 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను విడతల వారీగా మాఫీ చేస్తామని అన్నారు. అన్నట్లుగానే తొలి విడత రుణమాఫీ ప్రక్రియను జులై 18న ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. తొలి విడతలో రూ. 1 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేశారు. అర్హులైన 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 6,098 కోట్లు జమ చేశారు. రెండో విడతలో భాగంగా 6,40,223 మంది రైతులకు రూ. 6190.01 కోట్లు విడుదల చేశారు. మొత్తం రెండు విడతల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 17.75 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 12,224 కోట్లు జమ చేసి రైతు రుణాలు మాఫీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆగష్టు 15వ తేదీ నాటికి రూ. 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం.
Also Read:
ఎయిర్‌పోర్టులో నూతన గవర్నర్ జిష్ణుదేవ్‌కు స్వాగతం...
నీటిలో నుంచి ఒడ్డుకు చేరుకున్న జాగ్వార్.. సడన్‌గా..
హైదరాబాద్‌కి హైఅలర్ట్.. ఆగస్టులో భారీ వర్షాలు
For More Telangana News and Telugu News..
Updated Date - Jul 31 , 2024 | 03:50 PM