Jaggareddy: ఏ మొహం పెట్టుకుని దీక్ష చేస్తావ్.. హరీష్‌కు జగ్గారెడ్డి సూటి ప్రశ్న
ABN, Publish Date - Oct 05 , 2024 | 03:36 PM
Telangana: రుణమాఫీకి సంబంధించి మాజీ మంత్రి హరీష్‌రావుకు జగ్గారెడ్డి ఛాలెంజ్ విసిరారు. రుణమాఫీపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అంటూ సవాల్ చేశారు. రుణమాఫీపై రైతులతో చర్చ చేద్దామని.. ఎల్లిగాడు, మల్లిగాడు కాకుండా కేసీఆర్ చర్చకు రావాలన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 5: రుణమాఫీ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) చెబుతుండగా.. రుణమాఫీతో రైతులను కాంగ్రెస్ మోసం చేసిందంటూ బీఆర్‌ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఈ అంశంపై ప్రతీరోజు ఇరుపార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుతూనే ఉన్నారు. తాజాగా రుణమాఫీ అంశంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Congress Working President Jaggareddy) స్పందించారు. రుణమాఫీకి సంబంధించి మాజీ మంత్రి హరీష్‌రావుకు (Former Minister Harish Rao) జగ్గారెడ్డి ఛాలెంజ్ విసిరారు. రుణమాఫీపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అంటూ సవాల్ చేశారు. రుణమాఫీపై రైతులతో చర్చ చేద్దామని.. ఎల్లిగాడు, మల్లిగాడు కాకుండా కేసీఆర్ చర్చకు రావాలన్నారు.
Tirupati: ఏబీఎన్ చొరవ.. క్యాన్సర్ రోగి చివరి కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు
రుణమాఫీ కాలేదు నిజమే..కానీ
‘‘సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి చర్చకు నేను తీసుకువస్తాను.. కేసీఆర్‌ను ఒప్పించి తీసుకువచ్చే కెపాసిటీ హరీష్‌కు ఉందా. అక్కడ, ఇక్కడ భయమైతే సిద్దిపేటలోనే చర్చ పెట్టు. మేం పబ్లిసిటీ దగ్గర ఫెయిల్ అయ్యాం. బీఆర్ఎస్ పార్టీ పబ్లిసిటీ దగ్గర పాస్ అయింది. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని మేమే చెప్తున్నాం. హరీష్ రావు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆర్థిక శాఖను కేసీఆర్ దివాళా తీశారు. కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో 8 కిస్తిల్లో లక్ష రుణమాఫీ చేయలేకపోయారు. రుణమాఫీ అందని రైతులకు ఏ కారణాల వల్ల అందలేదో వివరాలు తెప్పించమని అధికారులకు సీఎం ఆదేశించారు’’ అని వెల్లడించారు.
రూ.100 కోట్లకు మరో దావా వేస్తా
గుండెను ఫ్రిజ్‌లో పెట్టారా?
ఏ మొహం పెట్టుకొని హరీష్ ఢిల్లీ వెళ్లి దీక్ష చేస్తారని ప్రశ్నించారు. ‘‘తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ నేను దీక్ష చేస్తా.. నిజమైన మోసం చేసిన కేసీఆర్ ఇంటి ముందు నేనే దీక్ష చేస్తా. హరీష్ ఢిల్లీలో దీక్ష చేసిన రోజే నేను కేసీఆర్ ఇంటి దగ్గర వెళ్లి దీక్ష చేస్తాను. రాహుల్ ఎక్కడ ఉంటాడో క్లారిటీ ఉంది. కేసీఆర్ ఎక్కడ ఉంటాడో తెలియదు. హరీష్ రావుకు స్క్రిప్ట్ ఇచ్చింది ఎవరో. హరీష్ డైలాగులకు డిక్షనరీలో కూడా అర్థాలు దొరకవు. కేసీఆర్ ది రైతు గుండె అని తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత గుర్తు వచ్చిందా? మల్లన్న సాగర్ రైతుల వీపులు పగలగొట్టినప్పుడు రైతు గుండె ఏమైంది? ఖమ్మం రైతులకు బేడీలు వేసినప్పుడు కేసీఆర్ గుండె ఫ్రిజ్‌లో పెట్టారా? సంగారెడ్డికి కేసీఆర్ వస్తే అడ్డుకుంటా అని అంటేనే హరీష్, కేసీఆర్ రాలేదు. మా దగ్గర అంతా తోపులే. కొన్ని హార్డ్ తోపులు, కొన్ని సాఫ్ట్ తోపులు ఉన్నాయి. మాకు ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో వెపన్ ఉంది. ఆటుపోట్లు తట్టుకొని నిలబడ్డవాళ్ళం మేము. మమ్మల్ని అడ్డుకోవడం కేటీఆర్ వల్ల కాదు. మహేష్ గౌడ్ మా బాస్’’ అంటూ జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Bathukamma: నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ.. నైవేద్యం ఇదే
Tirupati: ఏబీఎన్ చొరవ.. క్యాన్సర్ రోగి చివరి కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 05 , 2024 | 03:38 PM