ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CP Anand: గతేడాదిలా కాకుండా త్వరగానే గణేష్ నిమజ్జనానికి చర్యలు..

ABN, Publish Date - Sep 17 , 2024 | 03:28 PM

Telangana: గత ఏడాది లాగా ఆలస్యం కాకుండా త్వరగా గణేష్ నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకున్నామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మండప నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం జరిగేలా చూస్తున్నామన్నారు. బాలాపూర్ వినాయకుడు కూడా త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామని చెప్పారు.

CP CV Anand

హైదరాబాద్, సెప్టెంబర్ 17: భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్‌లో ఉన్న విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామన్నారు. గత ఏడాది లాగా ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మండప నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం జరిగేలా చూస్తున్నామన్నారు. బాలాపూర్ వినాయకుడు కూడా త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నామని చెప్పారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

Supreme Court of India: సుప్రీంకోర్టు సంచలన తీర్పు..


షిఫ్ట్ వారిగా 25 వేల మంది పోలీసులు బందోబస్తూ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నిమజ్జనంలో పోలీసులు అలసిపోకుండా షిఫ్ట్‌లు ప్రకారం డ్యూటీ చేస్తున్నారన్నారు. లక్ష విగ్రహాలు సిటీలో ఉండొచ్చని.. 20 నుంచి 30 వేలు విగ్రహాలు పెండింగ్ ఉన్నాయన్నారు. రేపు ఉదయంలోగా నిమజ్జనం మొత్తం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత ఏడాది లాగా కాకుండా ఈ ఏడాది త్వరగానే నిమజ్జనం అయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిమజ్జనం కోసం వచ్చే ప్రజలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్‌లలో రావాలని కోరుతున్నామన్నారు. మీడియాలో వచ్చే లైవ్ టెలికాస్ట్ చూడాలని ప్రజలను కోరుకుంటున్నామని సీపీ సీపీ ఆనంద్ పేర్కొన్నారు.


నిమజ్జనంపై డీజీపీ ఏమన్నారంటే..

ఈ ఏడాది వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. వివిధ మత పెద్దలతో రెండు సార్లు కో ఆర్డినేషన్ మీటింగ్ లెవల్ జరిగిందన్నారు. సీపీ, డీసీపీ లెవల్‌లో కూడా సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో కొనసాగిస్తామని హామీ ఇచ్చారన్నారు. బాలాపూర్ గణేశుడు ఇప్పటికే హైదరాబాద్ లిమిట్స్‌లో ఊరేగింపు కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బైంసాతో పాటు మరికొన్ని ప్రదేశాల్లో నిమజ్జనం పూర్తి అయిందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు, ఏర్పాట్లు చేశామన్నారు.

AP Cabinet: రేపే ఏపీ కేబినెట్ భేటీ.. ఏయే అంశాలపై చర్చిస్తారంటే.


ఈరోజు రాత్రిలోగా నిమజ్జనం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా టైం టు టైం అప్రమత్తంగా ఉంటూ ముందుకు వెళ్తామన్నారు. డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, పర్యవేక్షణ కొనసాగిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా పర్యవేక్షణ కొనసాగుతుందని అన్నారు. మూడు కమిషనరేట్ పరిధిలో లక్ష విగ్రహాలు నిమజ్జనం జరుగుతున్నాయన్నారు. రేపు వర్కింగ్ డే కాబట్టి ఈరోజు రాత్రిలోపే నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకుంటామని డీజీపీ జితేందర్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Atishi: అతిషి పోలిటికల్ ఎంట్రీ ఎలా జరిగిందంటే..?

Bhatti Vikramarka: చరిత్రలో 1948, సెప్టెంబర్ 17 గురించి డిప్యూటీ సీఎం ఏం చెప్పారంటే...

Read Latest Telangana NewsAnd Telugu News

Updated Date - Sep 17 , 2024 | 03:29 PM

Advertising
Advertising