Balalatha: స్మిత సబర్వాల్ వ్యాఖ్యలపై బాలలత స్ట్రాంగ్ కౌంటర్
ABN, Publish Date - Jul 22 , 2024 | 01:42 PM
Telangana: సివిల్స్‌లో దివ్యాంగుల కోటా అవసరమా అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. స్మిత వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తాజాగా... ప్రముఖ మోటివేటర్, సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు బాలలత స్పందిస్తూ స్మితపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, జూలై 22: సివిల్స్‌లో దివ్యాంగుల కోటా అవసరమా అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారణి స్మితా సబర్వాల్ (Senior IAS officer Smita Sabharwal) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. స్మిత వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తాజాగా... ప్రముఖ మోటివేటర్, సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు బాలలత స్పందిస్తూ స్మితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగవైకల్యం ఉన్నవారి గురించి మాట్లాడటానికి స్మిత సబర్వాల్‌కు ఉన్న అర్హత ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..
Smita Sabharwal: చిక్కుల్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
జ్యుడిషియరీ, పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు ఫీల్డ్‌లో పరిగెత్తుతూ స్మిత సబర్వాల్ ఎంతకాలం పనిచేశారని నిలదీశారు. వివక్షకు గురవుతున్న వికలాంగులను స్మిత సబర్వాల్ మాటలు మరింత కుంగదీశాయన్నారు. సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి మొదట అపాయింట్‌మెంట్ వికలాంగురాలికి ఇచ్చారని గుర్తు చేశారు. స్మిత తన మాటలు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా? లేక ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నారా అనేది తెల్చాలన్నారు.
PM Modi: రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాన్ని నిశ్శబ్దం చేసేందుకు ప్రయత్నించారు: మోదీ
స్మితకు సవాల్...
కోడ్ ఆఫ్ కండెక్ట్, సివిల్ సర్వేంట్ క్రమశిక్షణ రాహిత్యం కింద స్మిత సబర్వాల్‌పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంగవైకల్యం ఉన్న జై పాల్ రెడ్డి ఉత్తమ పార్లమెంటరీ సాధించారని తెలిపారు. స్మిత సబర్వాల్‌పైన చర్యలు తీసుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నామన్నారు. ‘‘ఇప్పటికైనా సివిల్స్ పరీక్ష రాస్తాను.. నాకన్నా ఎక్కువ మార్కులు సాధించమని స్మిత సబర్వాల్’’ సవాల్ విసిరారు. స్టీఫిన్ హాకింగ్, సుదా చంద్రన్ వంటి మేధావులు అంగవైకల్యం జయించారన్నారు. కేసీఆర్ హయాంలో పదేళ్ల పాటు సీఎంవోలో పనిచేసి కనీసం అడ్మినిస్ట్రేషన్‌పైన అవగాహన లేకుండా మాట్లాడటం బాధాకారమన్నారు. అంగవైకల్యంతో పద్మశ్రీ, పద్మ భూషన్ అవార్డులు తీసుకున్నవారు ఉన్నారన్నారు. 24 గంటల్లో స్మిత సభర్వాల్ తన మాటలు వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. రేపటిలోగా ప్రభుత్వం ఈ అంశంపైన స్పందించకపోతే టాంక్ బండ్‌పైన నిరసన తెలియజేస్తామని బాలలత స్పష్టం చేశారు.
Smita Sabharwal : సివిల్స్‌లో దివ్యాంగుల కోటా అవసరమా?
స్మిత వ్యాఖ్యలివే...
‘‘ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసు ఉద్యోగాలకు ఎక్కువగా క్షేత్ర స్థాయిలో పని చేయాల్సి ఉంటుంది.. ప్రజల కష్టాలను నేరుగా వినాల్సి ఉంటుంది.. ఇందుకు శారీరక దృఢత్వం, అవసరం.. కొన్నిసార్లు కఠిన సమయాల్లో పని చేయాల్సి ఉంటుంది.. వైకల్యం ఉన్న వారిని గౌరవిస్తున్నాను... కానీ వైకల్యం ఉన్న ఫైలట్‌ను విమానయాన సంస్థలు నియమించుకుంటాయా? వైకల్యం ఉన్న సర్జన్ సేవలను మీరు విశ్వసిస్తారా?’’ అంటూ ఐఏఎస్ అధికారిని స్మితసబర్వాల్ ట్వీట్ చేశారు. అయితే దివ్యాంగులపై స్మిత వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
Parliament Sessions: బలమైన ప్రతిపక్షం, మిత్రపక్షాల డిమాండ్‌లు.. మోదీకి విషమ పరీక్ష!
Rangam Bhavishyavani: ఆనందపరిచేలా స్వర్ణలత భవిష్యవాణి.. వైభవంగా ‘రంగం’ ఘట్టం
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jul 22 , 2024 | 01:45 PM