Delhi Liquor Scam: కవిత సంచలన లేఖ విడుదల.. లిక్కర్ స్కామ్‌పై ఏమన్నారంటే..
ABN , Publish Date - Apr 09 , 2024 | 01:34 PM
Delhi Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత(K Kavitha) మరోసారి స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న విధంగా తనకు ఎలాంటి ఆర్థిక పరమైన లాభం చేకూరలేదన్నారు. లిక్కర్ కేసులో(Liquor Scam) తాను బాధితురాలినని, రెండేళ్ల నుంచి కేసు విచారణ ఎటూ తేలడం లేదన్నారు. ఈ మేరకు మంగళవారం నాడు..
Delhi Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత(K Kavitha) మరోసారి స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న విధంగా తనకు ఎలాంటి ఆర్థిక పరమైన లాభం చేకూరలేదన్నారు. లిక్కర్ కేసులో(Liquor Scam) తాను బాధితురాలినని, రెండేళ్ల నుంచి కేసు విచారణ ఎటూ తేలడం లేదన్నారు. ఈ మేరకు మంగళవారం నాడు ఎమ్మెల్సీ కవిత 4 పేజీల లేఖను మీడియాకు విడుదల చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత జ్యూడీషియల్ కస్టడీ(Judicial Custody) ఇవాళ్టితో ముగిసింది. దీంతో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) ప్రవేశపెట్టగా కోర్టు ఆమెకు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు నుంచి వెళ్తున్న సమయంలో మాట్లాడిన కవిత.. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఉద్ఘాటించారు. రాజకీయ కుట్రలో భాగంగా తనపై తప్పుడు కేసుల పెట్టారని ఆరోపించారు. విచారణ సందర్భంగా జడ్జి ముందు చెప్పాలనుకున్న అంశాలను పేపర్ మీద రాసుకొచ్చారు కవిత. జడ్జి ముందు తన వాదనలు వినిపించే అవకాశం రాకపోవడంతో.. ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు.
లేఖలోని సారాంశం..
‘లిక్కర్ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు. వారు ఆరోపిస్తున్న విధంగా నాకు ఎలాంటి ఆర్థిక పరమైన లాభం చేకూరలేదు. లిక్కర్ కేసులో నేను బాధితురాలిని మాత్రమే. రెండేళ్ల నుంచి కేసు విచారణ ఎటూ తేలడం లేదు. మీడియా విచారణ ఎక్కువ జరుగుతోంది. సీబీఐ, ఈడీ ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతుంది. నా రాజకీయ పరపతిని దెబ్బతీసే విధంగా వివరిస్తున్నారు. నా మొబైల్ నెంబర్‌ను అన్ని ఛానళ్లలో వేసి నా ప్రైవసీకి భంగం కలిగించారు.’ అని పేర్కొన్నారు.
‘నాలుగుసార్లు ఈడీ విచారణకు హాజరయ్యాను. విచారణకు అన్ని విధాల సహకరించాను. బ్యాంకు, బిజినెస్ వివరాలను అందించాను. దర్యాప్తు సంస్థకు అన్ని మొబైళ్లను అందజేశాను. కానీ వాటిని ధ్వంసం చేశానని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. గత రెండున్నర ఏళ్లుగా సోదాలు చేశారు. మానసికంగా ఇబ్బందులకు గురి చేశారు. ఈ కేసులో చాలామందిని అరెస్టు చేశారు. లిక్కర్ కేసులో పలువురు పరస్పరంగా భిన్నంగా వాంగ్మూలాలు ఇచ్చారు. లిక్కర్ కేసు మొత్తం వాంగ్మూలాల ఆధారంగానే ఉంది.’
‘సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజీవ్ కన్నా సైతం లిక్కర్ కేసులో మనీ ట్రయిల్ జరగలేదని చెప్పారు. సాక్షులను బెదిరిస్తున్నట్టు ఈడి నాపై దుష్ప్రచారం ప్రచారం చేస్తుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఎందుకు అరెస్టు చేయలేదు. నాపై చర్యలు తీసుకోమని ఈడి సుప్రీంకోర్టులో అండర్ టేకింగ్ ఇచ్చింది. 95% ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెట్టారు. వారు బిజెపిలో చేరగానే వారిపై కేసుల విచారణ ఆగిపోయింది. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నేతలు విపక్ష నేతలను ఉద్దేశించి "నోరు మూసుకోండి లేదా ఈడి ను పంపుతాం" అని అన్నారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో విపక్ష పార్టీలన్నీ న్యాయవ్యవస్థ వైపు చూస్తున్నాయి. న్యాయవ్యవస్థ ఉపశమనం కల్పిస్తుందని ఆశతో ఉన్నాము.’ అని అన్నారు కవిత.
‘విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. బెయిల్ ఇవ్వాలని కోరుతున్నాను. నేను ఈ కేసులో బాధితురాలిని మాత్రమే. నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసులో సాక్షులను బెదిరిస్తున్నట్టు నాపై ఆరోపణలు చేస్తున్న ఈడీ, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదు? ఎలాంటి ఆధారాలు లేకపోయినా నన్ను ఇప్పుడు అరెస్టు చేశారు. రెండున్నర ఏళ్ల విఫల దర్యాప్తు అనంతరం ఈడి నన్ను అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టులో కఠిన చర్యలు తీసుకోబోము అని చెప్పి.. నన్ను అరెస్ట్ చేసింది.’
‘కేసు దర్యాప్తునకు సహకరించేందుకు నేను పూర్తి సిద్ధంగా ఉన్నాను. ఈ పరిస్థితుల్లో నాకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నాను. నా చిన్న కుమారుడు పరీక్షలకు సిద్ధపడుతున్న సమయంలో తల్లిగా నేను తనతో ఉండాలి. నా పాత్రను ఎవరు భర్తీ చేయలేరు. నేను లేకపోవడంతో నా కుమారుడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నాను. నా బెయిల్ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా మళ్లీ కోరుతున్నాను.’ అని లేఖలో పేర్కొన్నారు కవిత.