Bhatti Vikramarka: మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువనుంది
ABN, Publish Date - Oct 27 , 2024 | 02:34 PM
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేసి ప్రభుత్వ బడుల నిర్వహణ బాధ్యత అప్పగిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతుందని తెలిపారు.
ఖమ్మం: మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువనుందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఖమ్మం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్, బస్సు షెల్టర్, కలెక్టరేట్ సిబ్బంది భోజనశాల, లేడీస్ లాంజ్ , స్త్రీ టీ క్యాంటీన్‌లను ఇవాళ(ఆదివారం) భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ...ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతుందని తెలిపారు.
ఈ ఏడాది మహిళలకు వడ్డీ లేని రుణాలు రూ. 25 వేల కోట్లు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో మహిళలకు లక్ష కోట్ల రూపాయల రుణాలు వడ్డీ లేకుండా ఇస్తామని వివరించారు. మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడంతో పాటు వారు వ్యాపారాల్లో రాణించడానికి కావలసిన సంపూర్ణ సహకారం, ప్రోత్సాహకం ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఆర్టీసీలో డ్వాక్రా సంఘాల మహిళలను భాగస్వామ్యం చేయడానికి ఆలోచన చేస్తున్నామన్నారు. త్వరలో బస్సు యజమానులుగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళా సభ్యులు మారనున్నారని చెప్పారు. మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చి ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయించేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారు.
ఆ బస్సులను ఆర్టీసీ సంస్థకు అద్దెకు ఇప్పించి, దాని ద్వారా వచ్చే లాభాలతో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు. వ్యవసాయ ఆధారిత ఖమ్మం జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకువచ్చి మహిళలను భాగస్వాములు చేయాలని ప్రణాళికలు తయారు చేయిస్తున్నామని వివరించారు. వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా అధికారులు ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. రాష్ట్రంలోని మహిళలను ప్రజా ప్రభుత్వం మహాలక్ష్ములుగా కొలుస్తుందని అన్నారు.
ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని.. దాని ద్వారా వచ్చే డబ్బులను ప్రతినెల ఆర్టీసీకి రూ.400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేసి ప్రభుత్వ బడుల నిర్వహణ బాధ్యత అప్పగిస్తామని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదిక్కుకొని బలపడితే వారి కుటుంబం బలపడుతుందని ప్రజా ప్రభుత్వం భావిస్తుందని మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Rave party: కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు..
AV Ranganath: అనుమతులుంటే కూల్చం
KTR.. ఈ అంశంలో రేవంత్ రెడ్డి రికార్డ్ సాధించారు: కేటీఆర్
KTR: ‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో’.. కేటీఆర్‌పై కేంద్ర మంత్రి హాట్ కామెంట్స్..
Read Latest Telangana News and Telugu News
Updated Date - Oct 27 , 2024 | 02:37 PM