ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కొద్దిసేపట్లో అంత్యక్రియలు.. సడెన్‌గా తాను చనిపోలేదంటూ..

ABN, Publish Date - Jun 23 , 2024 | 07:07 PM

వికారాబాద్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చనిపోయాడనుకుని శవానికి అంత్యక్రియలు చేస్తుండగా.. అసలైన వ్యక్తి వచ్చి తాను బ్రతికే ఉన్నానని చెప్పాడు. దాంతో ఆ కుటుంబ సభ్యులు షాక్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఇంతకీ చనిపోయిన వ్యక్తి ఎవరు? అతన్నే వారు తమ కుటుంబ సభ్యునిగా ఎందుకు అనుకున్నారు? అంటే అంతా ఫోన్ తెచ్చిన చిక్కులు అని..

Hyderabad

హైదరాబాద్, జూన్ 23: వికారాబాద్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చనిపోయాడనుకుని శవానికి అంత్యక్రియలు చేస్తుండగా.. అసలైన వ్యక్తి వచ్చి తాను బ్రతికే ఉన్నానని చెప్పాడు. దాంతో ఆ కుటుంబ సభ్యులు షాక్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. మరి ఇంతకీ చనిపోయిన వ్యక్తి ఎవరు? అతన్నే వారు తమ కుటుంబ సభ్యునిగా ఎందుకు అనుకున్నారు? అంటే అంతా ఫోన్ తెచ్చిన చిక్కులు అని చెబుతున్నారు పోలీసులు. అవును.. ఒక ఫోన్.. గుర్తుతెలియని వ్యక్తికి మరో కుటుంబం అంత్యక్రియలు జరిపేలా చేసిందట. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి? పోలీసుల తెలిపిన వివరాలు చూద్దాం..


బషీరాబాద్ మండలం నావంద్గి గ్రామానికి చెందిన పిట్టల ఎల్లప్ప (45) రెండు రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లాడు. అయితే, అతని ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తి కొట్టేశాడు. ఈ కొట్టేసిన వ్యక్తి.. వికారాబాద్ సమీపంలో రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. రైలు బలంగా ఢీకొనడంతో.. అతని శరీరం ఛిత్రమైపోయింది. ముఖం గుర్తించే పరిస్థితి లేదు. అయితే, అతని వద్ద లభించిన ఫోన్‌ను పరిశీలించిన రైల్వే పోలీసులు.. మృతుడు నావంద్గీ గ్రామానికి చెందిన పిట్టల ఎల్లప్పగా భావించారు. దాంతో అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.


అయితే, కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించినా గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం ఉంది. ఆ మృతదేహాన్నే ఇంటికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. గొయ్యి తవ్వి అంతా సిద్ధం చేశారు. ఇంతలోనే ట్విస్ట్ చోటు చేసుకుంది. చనిపోయాడనుకున్న పిట్టల ఎల్లప్ప తాండూరులో తన బంధువుకు కనిపించాడు. అతన్ని చూసి షాక్ అయిన బంధువులు.. జరిగిన విషయాన్ని ఎల్లప్పకు చెప్పారు. తాను చనిపోయాడనుకుని ఎవరో శవానికి అంత్యక్రియలు చేస్తున్నారని చెప్పగా.. అతను వెంటనే తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. తాను బ్రతికే ఉన్నట్లు చెప్పాడు. అనంతరం హుటాహుటిన గ్రామానికి వెళ్లాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అంతా షాక్ అయ్యారు. విషయాన్ని వికారాబాద్ రైల్వే పోలీసులకు తెలియజేశారు. ఆ ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తి కాజేశాడని పోలీసులకు ఎల్లప్ప చెప్పాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More Telangana News and Telugu News..

Updated Date - Jun 23 , 2024 | 07:07 PM

Advertising
Advertising