ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GST Scam: జీఎస్టీ స్కామ్.. ఏ5గా మాజీ సీఎస్... త్వరలో నోటీసులు

ABN, Publish Date - Jul 29 , 2024 | 09:39 AM

Telangana: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కమర్షియల్ ట్యాక్స్‌ స్కామ్‌పై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ -5 నిందితుడిగా సోమేశ్ కుమార్ పేరు చేర్చారు. మాజీ సీఎస్‌‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్‌ ఎ.శివరామ ప్రసాద్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుపై కేసు నమోదు అయ్యింది.

Former CS Somesh Kumar

హైదరాబాద్, జూలై 29: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కమర్షియల్ ట్యాక్స్‌ స్కామ్‌పై (GST Scam) సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై (Former CS Somesh Kumar) పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ -5 నిందితుడిగా సోమేశ్ కుమార్ పేరు చేర్చారు. మాజీ సీఎస్‌‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్‌ ఎ.శివరామ ప్రసాద్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుపై కేసు నమోదు అయ్యింది. సీసీఎస్‌లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కనూరి ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ అయ్యింది.

YSRCP: వైసీపీకి ఇక చుక్కలే.. భూకబ్జాలపై కమిటీ..!


ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌లో చెల్లింపుల్లో రూ.1000 కోట్లు స్కామ్ జరిగినట్లు ఆరోపణల వచ్చాయి. నకిలీ ఇన్వైస్‌‌లు సృష్టించి నిందితుడు మోసాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. దాదాపు 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించారు. లబ్ది పొందిన కంపెనీల జాబితాలో రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఫోరెన్సిక్‌ అడిట్‌లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. మాజీ సీఎస్‌ సోమేష్ సూచనలతోనే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. స్కామ్‌ పాల్పడ్డ నిందితులపై ఐపీసీ 406,409,120B ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. త్వరలో అధికారులకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు.


ఇదీ సంగతి...

సాధారణంగా ఒక రాష్ట్రంలోని డీలర్లు, మరో రాష్ట్రంలోని డీలర్లకు విక్రయించే వస్తువులపై ఐజీఎస్టీని కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. దీనిని కేంద్రం, వస్తువులు కొన్న రాష్ట్రానికి చెరో 50ు పంపిణీ అవుతుంది. అయితే రాష్ట్రంలోని కొంతమంది డీలర్లు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఇక్కడి డీలర్లు ఇతర రాష్ట్రాల వారికి వస్తువులను విక్రయించినట్లుగా నకిలీ ట్యాక్స్‌ ఇన్వాయి్‌సలను సృష్టించారు. ప్రధానంగా 18ు ట్యాక్స్‌ ఉన్న ఇనుము, ఇత్తడి, రాగి స్ర్కాప్‌ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఆ ఇన్వాయి్‌సలలో పేర్కొన్నారు. నిజానికి ఈ వస్తు రవాణా భౌతికంగా జరగదు. కేవలం కాగితాల్లోనే సరఫరాలు ఉంటాయి. ఉదాహరణకు తెలంగాణలోని ఒక డీలరు పంజాబ్‌కు స్ర్కాప్‌ను పంపించినట్లు ఇన్వాయి్‌సలు తయారు చేశాడు. పంజాబ్‌ వ్యాపారి ఆ ఇన్వాయి్‌సలను ఆధారంగా చేసుకుని 18ు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను జీఎస్టీ కౌన్సిల్‌ ఖాతాల నుంచి క్లెయిమ్‌ చేశాడు. ఈ సొమ్మును పంజాబ్‌ డీలరు, తెలంగాణ డీలరు పంచుకున్నారు. ఇలా తెలంగాణలోని పలువురు డీలర్లు, ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు కూడబలుక్కుని సర్కారు ఖజానా నుంచి ఐటీసీని కొల్లగొట్టారు. ఇలా కొల్లగొట్టిన మొత్తం విలువ రూ.1000 కోట్లుగా ఉంటుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి మొదట్లోనే గుర్తించారు. ఈ కుంభకోణం జరిగిన తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ ఫిబ్రవరి 22న పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది.

Olympic: తక్షణమే జాబ్ నుంచి తొలగింపు..!!


జీఎస్టీలో పన్ను ఎగవేతలు, బకాయిలు వంటివాటిని గుర్తించడానికి వాణిజ్య పన్నుల కమిషనరేట్‌ ఓ ప్రైవేటు సంస్థతో సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయించింది. అయితే ఈ సాఫ్ట్‌వేర్‌లో కీలకమైన మాడ్యుల్‌ లేకపోవడం వెనకా.. పోలీసులు తాజాగా కేసు నమోదు చేసిన ఇద్దరు అధికారుల ప్రమేయం ఉన్నట్లు వాణిజ్యపన్నుల కమిషనరేట్‌ అప్పట్లోనే గుర్తించింది. సాధారణంగా డీలర్లు తాము అమ్మిన వస్తువులకు ‘జీఎస్టీఆర్‌-1’ రిటర్నులు, ఆ తర్వాత అమ్మకాలు, కొనుగోళ్లు, చెల్లించాల్సిన పన్నుకు సంబంధించి ‘జీఎస్టీఆర్‌-3బీ’ రిటర్నులను ఫైల్‌ చేయాలి. వస్తువులను కొన్న ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు జీఎస్టీఆర్‌-1తో పాటు ‘జీఎస్టీఆర్‌-2ఏ’ రిటర్నులను సమర్పించాలి. దీని ద్వారా ఎంత విలువైన వస్తువులను కొనుగోలు చేశారన్నది తేలుతుంది. వస్తువులు అమ్మిన డీలరు జీఎస్టీఆర్‌-3బీని సమర్పిస్తేనే వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ వివరాలు వెల్లడవుతాయి. కానీ.. ఇక్కడి డీలర్లు వస్తువులను ఇతర రాష్ట్రాల డీలర్లకు అమ్మినట్లు జీఎస్టీఆర్‌-1 రిటర్నులను మాత్రమే ఫైల్‌ చేశారు. వీటి ఆధారంగా ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు వస్తువులను కొనుగోలు చేసినట్లు జీఎస్టీఆర్‌-2తో పాటు జీఎస్టీఆర్‌-3బీని ఫైల్‌ చేశారు. దాంతో వారికి ఐటీసీని క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఏర్పడింది. పెద్ద మొత్తంలో ఐటీసీని క్లెయిమ్‌ చేశారు. ఇలా రిటర్నులను ఫైల్‌ చేసినట్లు చూపారే తప్ప.. భౌతికంగా వస్తు సరఫరా జరగలేదు.


ఇక్కడి డీలర్లు జీఎస్టీఆర్‌-3బీని సమర్పించినట్లయితే ప్రభుత్వానికి జీఎస్టీని చెల్లించాల్సి ఉండేది. అసలు వస్తు రవాణా జరగనప్పుడు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ.. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌(ఐటీసీ)ని క్లెయిమ్‌ చేయడానికే వస్తు సరఫరా జరిగినట్లు దొంగ ఇన్వాయి్‌సలను సృష్టించారు. అయితే రెండు రాష్ట్రాల మధ్య జరిగే లావాదేవీల ఐజీఎస్టీ సంబంధిత జీఎస్టీఆర్‌-3బీని సమర్పించారా? లేదా? అన్నది గుర్తించే ‘మాడ్యూల్‌’ కమిషనరేట్‌ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో లేనట్లు తేలింది. రాష్ట్ర వస్తు సేవల పన్ను(ఎ్‌సజీఎస్టీ), కేంద్ర వస్తు సేవల పన్ను(సీజీఎస్టీ)ల రిటర్నులను గుర్తించే మాడ్యూల్స్‌ను మాత్రమే సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చారు. ఐజీఎస్టీకి సంబంధించిన మాడ్యూల్‌ను పొందుపర్చకపోవడంతో ఇక్కడి డీలర్లు పన్ను సంబంధిత రిటర్నులను దాఖలు చేశారా? లేదా? అన్నదాన్ని సాఫ్ట్‌వేర్‌ గుర్తించడం లేదు.

Rajasthan: సీఎంను హత్య చేస్తామంటూ బెదిరింపు.. రంగంలోకి దిగిన పోలీసులు


పర్యవసానంగా దొంగ ఇన్వాయిస్‌లతో ఐటీసీని కొల్లగొట్టినట్లు తేలింది. ఫిబ్రవరిలో ఈ కుంభకోణం బయటపడగానే.. అంతర్గత విచారణలో సదరు సాఫ్ట్‌వేర్‌ సంస్థతో ఆ మాడ్యూల్‌ లేకుండా చూడాలంటూ సోమేశ్‌కుమార్‌తో పాటు కాశీవిశ్వేశ్వర్‌రావు, శివరాం ప్రసాద్‌ సూచించినట్లు తేలింది. దాంతో.. అప్పట్లోనే కాశీవిశ్వేశ్వర్‌రావు, శివరాంప్రసాద్‌కు మెమోలు జారీ చేశారు. కాగా.. ఫిబ్రవరి 22న ‘ఆంధ్రజ్యోతి’ ఈ కుంభకోణాన్ని వెలికితీయడంతో.. మాజీ సీఎస్‌ సోమేశ్‌ దీనిపై విచారణ జరపొద్దంటూ అధికారులపై ఒత్తిడి పెంచారు. సోమేశ్‌కుమార్‌ సీఎ్‌సగా ఉన్నప్పుడు వాణిజ్యపన్నులు, ఎక్సైజ్‌ శాఖలను తనవద్దే పెట్టుకున్నారు. రేవంత్‌ సర్కారు అధికారంలోకి రావడంతో.. అధికారుల బదిలీలు జరిగాయి. కొత్తగా వచ్చిన అధికారులు ఈ కుంభకోణాన్ని గుర్తించారు.


ఇవి కూడా చదవండి...

Rajasthan: సీఎంను హత్య చేస్తామంటూ బెదిరింపు.. రంగంలోకి దిగిన పోలీసులు

Social Media: చైనాలో ఇండియన్ ఇన్‌ఫ్లూయన్సర్‌ చేసిన వీడియోపై దుమ్మెత్తి పోస్తున్న భారతీయులు

Read Latest Talangana News And Telugu News

Updated Date - Jul 29 , 2024 | 09:52 AM

Advertising
Advertising
<