Harishrao: సిద్ధిపేటలో రిజర్వాయర్ల పరిస్థితిపై మంత్రి ఉత్తమ్‌కు హరీష్ లేఖ
ABN, Publish Date - Aug 03 , 2024 | 10:37 AM
Telangana: సిద్ధిపేట జిల్లాలోని రిజర్వాయర్లలో నీటి పరిస్థితికి సంబంధించి తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ రావు లేఖరాశారు. సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ (అనంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్‌లు పూర్తిగా నీళ్లు లేక రిజర్వాయర్‌లు అడుగంటి పోయే పరిస్థితికి చేరుకున్నాయని తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 3: సిద్ధిపేట జిల్లాలోని రిజర్వాయర్లలో నీటి పరిస్థితికి సంబంధించి తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి (Minister Uttam Kumarreddy) మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Former Minister Harish Rao) లేఖరాశారు. సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ (అనంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్‌లు పూర్తిగా నీళ్లు లేక రిజర్వాయర్‌లు అడుగంటి పోయే పరిస్థితికి చేరుకున్నాయని తెలిపారు. గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్‌లో 3.32 టీఎంసీల నీళ్ళు ఉంటే ప్రస్తుతం 0.75 టీఎంసీలుగా ఉందన్నారు. అలాగే రంగనాయక సాగర్‌లో 2.38 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.67 టీఎంసీలు మాత్రమే ఉన్నాయన్నారు. ఇటు మల్లన్న సాగర్‌లో 18 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.5 టీఎంసీలు ఉందని.. కొండ పోచమ్మ సాగర్‌లో 10 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు.
Viral Video: వామ్మో..! షాకింగ్ వీడియో... సింహంపైనే స్వారీ చేశాడు.. ఆ వెంటనే..
ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. పంటలు వేయాలా?.. వద్దా? అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడ తగ్గి పోయిందన్నారు. కాబట్టి రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానెర్ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ కు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం పక్షాన కోరుతున్నాను అంటూ హరీష్‌రావు లేఖలో పేర్కొన్నారు.
CM Chandrababu: ఉచిత ఇసుకలో సమస్యలెందుకు?
జాబ్ క్యాలెండర్‌పై ఇలా..
జాబ్ క్యాలెండర్ ఒక పెద్ద జోక్ క్యాలెండర్ అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోగస్ ప్రకటన ఇచ్చి నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ యువతకు బస్సులు పెట్టి గ్రామగ్రామాలు తిప్పారని, గెలిచిన మెుదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఊదరగొట్టారన్నారు. గద్దెనెక్కిన తర్వాత వారిని మరచిపోయారన్నారని విమర్శించారు. మొదటి క్యాబినెట్‌లోనే జాబ్ క్యాలెండర్ అన్నారని... అధికారం చేపట్టిన 8నెలల తర్వాత ఇచ్చిన దాంట్లోనూ ఎన్ని ఉద్యోగాలో చెప్పకుండా నిరుద్యోగులను మోసం చేశారని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తే ఎవరు ఇచ్చారనేది ఉంటుంది. అయితే జాబ్ క్యాలెండర్‌పై పేరు, సంతకం రెండూ లేవు. ఒక చిత్తు కాగితం లాగా ప్రకటించారు. చర్చ కూడా లేకుండా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దాన్ని చదివి సభ నుంచి పారిపోయారన్నారు. ‘‘లక్షలాది మంది యువతీయువకుల కంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా?. చర్చ చేయమంటే ఎందుకు పారిపోయారో చెప్పాలి. ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సభలో మైక్ ఇచ్చి మాట్లాడే ప్రయత్నం చేయించారు. మీకు మాట్లాడే ముఖం లేదా?. మిమ్మల్ని వదిలిపెట్టం నిరుద్యోగుల తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. అభయ హస్తం మ్యానిఫెస్టోలో చెప్పినవి ఒక్కటీ అమలు చేయలేదు. రెండు లక్షల ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. రేవంత్ రెడ్డి గన్‌మెన్ లేకుండా అశోక్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి. మీరు ఉద్యోగాలు ఇచ్చింది నిజమే అయితే దమ్ముంటే రావాలి. మీరు ఏ టైమ్, డేట్ చెప్పినా నేను వస్తా. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు దాక్కుంటారు, ఎన్ని రోజులు తప్పించుకుంటారు. యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి’’ అంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
YSRCP: బొత్స ఎంపికపై వైసీపీ నేతల్లో గరంగరం!
Cyber Crime: సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 03 , 2024 | 10:39 AM