Share News

Harish Rao: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్‌ ఏ రేంజ్‌లో సవాల్ విసిరారంటే

ABN , Publish Date - Oct 18 , 2024 | 01:32 PM

Telangana: ‘‘రేవంత్ రెడ్డి సవాలుకు సిద్ధం. రేపు రమ్మంటావా.. ఎల్లుండి రమ్మంటావా. సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్. పోదాం పదా. డేట్, టైం మీరే చెప్పండి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇద్దరమే పోదాం. లేదంటే రేపు ఉదయం 9 గంటలకు నేను సిద్ధం’’

Harish Rao: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్‌ ఏ రేంజ్‌లో సవాల్  విసిరారంటే
Former Minister Harish Rao

హైదరాబాద్, అక్టోబర్ 18: మూసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth reddy) వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రేవంత్ రెడ్డి సవాలుకు సిద్ధం. రేపు రమ్మంటావా.. ఎల్లుండి రమ్మంటావా. సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్. పోదాం పదా. డేట్, టైం మీరే చెప్పండి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇద్దరమే పోదాం. లేదంటే రేపు ఉదయం 9 గంటలకు నేను సిద్ధం. ముందు మూసీ నిర్వాసితుల వద్దకు, ఆ తర్వాత ఆర్‌అండ్‌ఆర్ కాలని, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కట్ట మీదకు పోదాం అక్కడే కూర్చొని మాట్లాడుదాం’’ అంటూ మాజీ మంత్రి సవాల్ విసిరారు.

Yahya Sinwar: ఎవరీ యహ్వా సిన్వర్.. ఇజ్రాయెల్ కాల్పుల్లో మరణించిన హమాస్ అగ్రనేత కథ ఏంటి?


సీఎం రేవంత్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2013 చట్టానికి మించిన ప్రయోజనాలు మల్లన్న సాగర్ ప్రజలకు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకొచ్చారు. పేదల ఇళ్ళను కూల్చటాన్ని మాత్రమే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి సీఎం మాటలతో అబద్ధం కూడా ఆశ్చర్యపోయిందన్నారు. ప్రజల‌ దృష్టిని మరల్చడం కోసమే సీఎం రేవంత్ మూసీ అంశాన్ని తీసుకొచ్చారన్నారు. ఎన్నికల‌ హామీలు నెరవేర్చటంలో కాంగ్రెస్ చతికిలపడిందని విమర్శించారు. నదీ జలాల శుద్ధితో మూసీ నది పునర్జీవ ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. మొదట మూసీ నదిలో వ్యర్థాలు వచ్చి చేరకుండా అడ్డుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చారని మండిపడ్డారు. మూసీలో గోదావరి నీళ్ళను కలపటానికి డీపీఆర్ కూడా సిద్ధమైందని తెలిపారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదన్నారు.

Viral Video: కామ్‌గా ఉన్న ఎద్దును కెలికితే ఇలాగే ఉంటుంది మరీ.. వీడియో చూస్తే పగలబడి నవ్వాల్సిందే..


ఇంతకీ సీఎం ఏమన్నారంటే...

మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణ భవిష్యత్‌ను నిర్దేశించే ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టిందన్నారు. 33 బృందాలు మూసీ పరివాహకంపై అధ్యయనం చేశాయని సీఎం తెలిపారు. మూసీ పరివాహకంలో నివసిస్తున్న వారు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని.. అలాంటి వారికి మెరుగైన జీవితం అందించాలని భావిస్తున్నామన్నారు. విషవలయంలో పేదలు ఉండాలనేది కొందరి ఆలోచన అంటూ విపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్. భూగరిష్ట పరిమితి చట్టాన్ని వ్యతిరేకించిన వర్గం కూడా దేశంలో ఉండేదన్నారు. పేదలు ఎప్పుడూ పేదలుగానే ఉండాలని దొరలు, భూస్వాములు భావిస్తారన్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు, అధికారులు రాష్ట్రాన్ని దోచుకున్నారని సీఎం ఆరోపించారు. తాము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదని.. మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమం అని చెప్పారాయన. కొందరి మెదడులో మూసీలో ఉన్న మురికి కంటే.. ఎక్కువ విషం నింపుకున్నారంటూ విపక్ష నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.


విషపూరిత ఆలోచనలతోనే మూసీ ప్రాజెక్ట్‌పై దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ, కిష్టాపూర్ ఎక్కడికైనా.. సెక్యూరిటీ లేకుండా తానువ స్తానని అన్నారు. విపక్ష నేతలు కూడా రావాలని సవాల్ విసిరారు. అక్కడ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిద్దామన్నారు. ‘‘మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ వద్దని ప్రజలు అడ్డుకోలేదా? ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించి ప్రాజెక్టులు నిర్మించ లేదా? మూసీ సుందరీకరణకు ప్రణాళికలు రూపొందించామని కేటీఆర్‌ అనలేదా? అడ్డుకుంటున్న నేతలు 3 నెలలు మూసీ ఒడ్డున జీవించాలి. కేటీఆర్‌, హరీశ్‌రావు, ఈటల మూడునెలలపాటు మూసీ ఒడ్డున ఉండాలి. వాళ్లు ఉంటానంటే కావాల్సిన వసతులు అన్నీ కల్పిస్తాం. కేటీఆర్‌, హరీశ్‌రావు, ఈటల 3 నెలలు అక్కడ ఉంటే.. ఈ ప్రాజెక్టును ఆపేస్తాను’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్ విసిరారు.


ఇవి కూడా చదవండి..

Group 4 candidates: గాంధీభవన్ వద్ద గ్రూప్ - 4 అభ్యర్థుల ఆందోళన.. డిమాండ్స్ ఇవే

Ani Master: జానీ మంచివారు...నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 18 , 2024 | 01:32 PM