ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: మహాభారతంలో దుర్యోధనుడి క్రూరత్వంలా రేవంత్ ప్రవర్తన..

ABN, Publish Date - Sep 19 , 2024 | 02:59 PM

Telangana: రేవంత్ రెడ్డి ప్రవర్తన మహాభారతంలో దుర్యోధనుడి క్రూరత్వంలా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తన నైతిక ప్రమాణాలను పాటించకుండా ఇతరులకు నీతులు చెప్పడం శోచనీయమన్నారు. కేసీఆర్‌పై , ఆయన కుటుంబంపై రేవంత్ రెడ్డి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చడం కాదా అని అడిగారు.

Former Minister Harisha Rao Letter to Kharge Rahul Gandhi

హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే (AICC Chief Mallikarjuna Kharge), లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Former MLA Harish Rao) బహిరంగ లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (Former CM KCR) అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. మాజీ సీఎంపై రేవంత్ దూషణలు, కించపరచే వ్యాఖ్యలు చేయడం అతని దిగజారుడుతనానికి నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఒక రూల్ గల్లీలో ఒక రూల్ పాటించడం కాంగ్రెస్‌కే చెల్లుతుంది అంటూ హరీష్ లేఖలో పేర్కొన్నారు.

Nagababu: నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా


లేఖలో హరీష్ రావు

కాంగ్రెస్ పార్టీ తనే ప్రవచించిన ప్రమాణాలను పాటించకపోవడం ద్వంద ప్రమాణాలకు నిదర్శనమన్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్రవాది అని వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిందన్నారు. రాజకీయాల్లో దిగజారుడు విమర్శలను తీవ్రంగా ఖండించిందన్నారు. రాజ్యాంగ విలువలను దిగజారుస్తున్నారని మొసలి కన్నీరు కార్చిందననారు. అలాంటి దూషణలే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే హై కమాండ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ పార్టీ డబల్ స్టాండర్డ్స్ కాదా అని నిలదీశారు. ఢిల్లీలో ఒక రూల్ గల్లీలో ఒక రూల్ పాటించడం కాంగ్రెస్‌కే చెల్లుతుందని విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధమన్నారు. కాంగ్రెస్ హైకామాండ్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

AP Politics: వినుకొండ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. త్వరలోనే..


ఆ వ్యాఖ్యలను హైకమాండ్ సమర్థిస్తుందా...

రేవంత్ రెడ్డి ప్రవర్తన మహాభారతంలో దుర్యోధనుడి క్రూరత్వంలా ఉందన్నారు. కాంగ్రెస్ తన నైతిక ప్రమాణాలను పాటించకుండా ఇతరులకు నీతులు చెప్పడం శోచనీయమన్నారు. కేసీఆర్‌పై , ఆయన కుటుంబంపై రేవంత్ రెడ్డి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చడం కాదా అని అడిగారు. ‘‘కేసీఆర్‌ను రాళ్లతో కొట్టి చంపాలి" అనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ హై కమాండ్ సమర్ధిస్తుందా అని నిలదీశారు. హింసాత్మక వ్యాఖ్యలు చేయడం, జర్నలిస్టులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్ నాయకులపై నిరాధార కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడడం దుర్మార్గమన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని చెప్పేందుకు ఇది నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరి మహాభారతంలో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి దుర్మార్గాలను ఉపేక్షించడం లాంటిదే అని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని.. ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న ముఖ్యమంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు లేఖలో డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

HYDRA: హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్‌‌సాగర్‌‌లో నిర్మాణాలేనా..

KTR: నాణ్యమైన వైద్యం అందించేందుకు ఫోక‌స్ చేశారా... లేదా

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 19 , 2024 | 03:02 PM

Advertising
Advertising