KTR: లగచర్ల ఘటనపై చర్చ పెట్టమంటే పారిపోయారు: కేటీఆర్..
ABN, Publish Date - Dec 16 , 2024 | 04:34 PM
ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమ రైడర్ షిప్ తగ్గిందని ఎల్ అండ్ టీ వంటి అంతర్జాతీయ సంస్థ సీఎఫ్ఓ ఒక్కమాట అంటే ఆయన్నీ జైల్లో పెడతానమే నియంతృత్వ ధోరణిలో ముఖ్యమంత్రి వెళ్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహించారు. సంగారెడ్డి జైల్లో ఉన్న కొడంగల్ రైతులు, అలాగే చర్లపల్లి జైల్లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆయన చెప్పారు.
హైదరాబాద్: ఢిల్లీ (Delhi)కి వందసార్లు పోయినా వంద పైసలు కూడా తెలంగాణ (Telangana) రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం తేలేకపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తనపై ఎవరూ మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వారిని జైళ్లల్లో పెడుతున్నారని కేటీఆర్ ఆగ్రహించారు. 35 రోజులుగా కొండగల్ రైతులు జైలులోనే మగ్గుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వారినీ వదిలిపెట్టడం లేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ప్రశ్నిస్తే జైలుకే..
ఉచిత బస్సు ప్రయాణం వల్ల తమ రైడర్ షిప్ తగ్గిందని ఎల్ అండ్ టీ వంటి అంతర్జాతీయ సంస్థ సీఎఫ్ఓ ఒక్కమాట అంటే ఆయన్నీ జైల్లో పెడతానమే నియంతృత్వ ధోరణిలో ముఖ్యమంత్రి వెళ్తున్నారని కేటీఆర్ ఆగ్రహించారు. సంగారెడ్డి జైల్లో ఉన్న కొడంగల్ రైతులు, అలాగే చర్లపల్లి జైల్లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో న్యాయపోరాటం కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. తెలంగాణ గడ్డ సీఎం రేవంత్ రెడ్డి అయ్యా జాగీరా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూములు ఇవ్వబోమని చెప్పిన రైతులను జైల్లో పెట్టేందుకు అసలు రేవంత్ రెడ్డి ఎవరంటూ కేటీఆర్ ప్రశ్నించారు. నియంత, చక్రవర్తి, రారాజులా రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని, అలాగే పాలన చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ అత్యున్నత సభైన శాసనసభలో కొడంగల్ రైతుల గురించి చర్చ పెట్టమంటే రేవంత్ పారిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఎంతవరకైనా వెళ్తాం..
సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నినా తెలంగాణ రైతుల కోసం పోరాటం చేస్తూనే ఉంటామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి దోస్తు అదానీ టీషర్టులు వేసుకుని వస్తే మెున్న తమను అసెంబ్లీలోకి అగుడుపెట్టనీయలేదని మండిపడ్డారు కేటీఆర్. లగచర్ల రైతులు, గిరిజన ఆడబిడ్డలపై అర్దరాత్రి దాడులు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వారిపై వేధింపుల గురించి చర్చించాలని పట్టుపడితే నేడు సభను వాయిదా వేసి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి పారిపోయారని కేటీఆర్ మండిపడ్డారు. లగచర్ల రైతుల తరఫున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారని, తామంతా వారి వెంటే ఉండి పోరాటం చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: సినిమా షూటింగ్‌లో గాయపడ్డ రెబల్ స్టార్ ప్రభాస్..
BRS: రేవంత్ సర్కార్‌పై మరో ప్లాన్‌కు సిద్ధమైన బీఆర్‌ఎస్
Updated Date - Dec 16 , 2024 | 04:40 PM