KTR: ‘ఈమహా నగరానికి ఏమైంది?’.. కేటీఆర్ షాకింగ్ ట్వీట్
ABN, Publish Date - Jul 11 , 2024 | 03:01 PM
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. అనుభవం లేని నాయకత్వం తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తోందంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ నగరానికి ఏమైంది’’ అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
హైదరాబాద్, జూలై 11: కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR) విరుచుకుపడ్డారు. అనుభవం లేని నాయకత్వం తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తోందంటూ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో శాంతి లేదని, బ్రాండ్ హైదరాబాద్ మసకబారుతోదంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని... హత్యలు పెరిగిపోతున్నాయంటూ కాంగ్రెస్ సర్కార్‌పై తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చారు. ‘‘ఈ నగరానికి ఏమైంది’’ అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
CM Chandrababu: మళ్లీ నేనే స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతా...
కేటీఆర్ ట్వీట్ ఇదే...
‘‘ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ పత్రికలు కూడా ఈ నగరానికి ఏమైంది?" అని ఫ్రంట్ పేజిలో వార్తలు రాస్తోంది అంటే నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని అర్థం! పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాదు నుండి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా కనిపిస్తోంది!
"బ్రాండ్ హైదరాబాద్"
ఎందుకు మసకబారుతోంది ??
విశ్వనగరంగా ఎదుగుతున్న వేళ..
ఎందుకింత కళ కోల్పోతోంది ???
సగటు హైదరాబాదీకి
కలుగుతున్న భావన ఇది..!
హైదరాబాద్ ను ప్రేమించే
ప్రతిఒక్కరిలో ఉన్న ఆవేదన ఇది..!!
పదేళ్ళు ప్రశాంతంగా ఉన్న నగరంలో
పెరిగిపోతున్న వరుస హత్యలు..
పేట్రేగిపోతున్న అంతరాష్ట్ర ముఠాలు..
రాజధాని హైదరాబాద్ లో శాంతి లేదు..
నగర ప్రజల జీవితాలకు భద్రత లేదు..
సీఎం గారు స్వయంగా...
పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తున్నా..
పోలీసింగ్ పై కమాండ్ ఏది..?
క్షీణిస్తున్న శాంతిభద్రతలపై కంట్రోల్ ఏది..??
ఓవైపు..
కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం..
పరిపాలనా వైఫల్యాన్ని వేలెత్తి చూపుతోంది.
మరోవైపు..
పడగవిప్పిన హత్యల సంస్కృతి..
ప్రతి కుటుంబంలో వణుకు పుట్టిస్తోంది.
ఇంకోవైపు..
తరలిపోతున్న పెట్టుబడుల పర్వం..
యువత ఉపాధి అవకాశాల్ని దెబ్బతీస్తోంది.
కాంగ్రెస్ పవర్ లోకి రాగానే
గడియ గడియకు ఏమిటీ.. పవర్ కట్ ?
సేఫ్ సిటీ గా ఉన్న మహానగరంలో..
ఎందుకు పెరుగుతోంది.. క్రైం రేట్ ??
ఇదేనా మీరు తెస్తానన్న మార్పు ?
విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి..
పదేళ్లు కష్టపడి పునాదులు వేస్తే..
అధికారంలోకి రాగానే ఆగం చేస్తే ఎలా ?
ప్రపంచంతో పోటీపడే నగరంగా
ఎదుగుతున్న హైదరాబాద్ ప్రగతికి
అర్ధాంతరంగా బ్రేకులు వేస్తే ఎలా ??
దేశ రాజధాని చుట్టూ..
రాజకీయ చక్కర్లు కొట్టడంపై ఉన్న శ్రద్ధ..
చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్న
రాష్ట్ర రాజధానిపై లేకపోతే ఎలా ???
హైదరాబాద్ అంటే..
కేవలం రాజధాని కాదు..
"తెలంగాణ ఎకనమిక్ ఇంజన్ "
ఇకనైనా..
కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే..
మన హైదరాబాద్ దెబ్బతింటే..
రాష్ట్రానికి కష్టమే కాదు..
యావత్ దేశానికి కూడా నష్టం..’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
Mothkupalli: పవన్ ఫోటోలు పెట్టినట్టే భట్టి ఫోటోలు కూడా పెట్టాల్సిందే...
Raj Tarun: లావణ్య, రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్
Reader Latest Telangana News And Telugu News
Updated Date - Jul 11 , 2024 | 04:07 PM