ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఫోన్ ట్యాపింగ్ కేసు.. చిరుమర్తి లింగయ్య కీలక విషయాలు వెల్లడి..

ABN, Publish Date - Nov 14 , 2024 | 03:09 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలైన బొల్లం మల్లయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డికి సైతం పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత మల్లయ్య, శేఖర్ రెడ్డిలను విచారించే అవకాశం ఉంది.

Former MLA Chirumurthy Lingaiah

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది. తిరుపతన్నతో మాట్లాడిన ఫోన్ కాల్స్‌‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు మాజీ ఎమ్మెల్యేను విచారించారు. ప్రస్తుత నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులైన మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ల ట్యాప్ చేయడంపై పలు పశ్నలు సంధించారు. ఈ ఇద్దరి ఫోన్‌లు ట్యాప్ చేసినట్టు వచ్చిన రిపోర్టును లింగయ్య ఎదుటపెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా డబ్బు తరలింపుపైనా ప్రశ్నలు సంధించారు. విచారణ అనంతరం చిరుమర్తి లింగయ్య మీడియాతో మాట్లాడారు.


ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. "పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా. తనకు తెలిసిన అధికారి కాబట్టి నేను గతంలో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడాను. మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ నంబర్లు తిరుపతన్న అడిగారు. వారిద్దరి ఫోన్ నంబర్స్ నా అనుచరుల వద్ద తీసుకుని అతనికి ఇచ్చాను. నంబర్లు ఎందుకు ఆడిగావని నేను తిరుపతన్నను ప్రశ్నించా. కానీ మునుగోడు ఎన్నికల సమయంలో ప్రచారం ఎలా జరుగుతుందని తిరుపతన్న నన్ను అడిగారు. ప్రచారం బాగానే జరుగుతోందని నేను ఫోన్లో చెప్పా.


ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరుల ఫోన్ ట్యాప్ చేశారనేది అవాస్తవం. మీడియాలో ఎక్స్‌పోజ్ అవ్వాలనే ఉద్దేశంతో కొంతమంది నాపై తప్పుడు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా పోలీసులకు నేను సహకరిస్తా. ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. తిరుపతన్నతో మాట్లాడిన కాల్ లిస్ట్ ఆధారంగానే నన్ను ప్రశ్నించారు. పోలీసుల దగ్గర ఏదో ఆధారం ఉంది కాబట్టే నన్ను విచారించారని భావిస్తున్నా. నా స్టేట్మెంట్‌ను వీడియో రికార్డ్ చేశారు. ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తా" అని చెప్పారు.


కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలైన బొల్లం మల్లయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డికి సైతం పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత మల్లయ్య, శేఖర్ రెడ్డిలను విచారించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారిగా రాజకీయ నేతలను పోలీసులు విచారిస్తున్నారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మాజీ ఎమ్మెల్యే లింగయ్య విచారణ తర్వాత మరో మాజీ మంత్రికి పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి:

Minister Ponguleti :బీఆర్ఎస్ నేతలు అలా చేస్తే తీవ్ర పరిణామాలు.. మంత్రి పొంగులేటి మాస్ వార్నింగ్

BJP: మిడి మిడి జ్ఞానంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: కిషన్ రెడ్డి

Updated Date - Nov 14 , 2024 | 03:18 PM