ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uppal flyover: ఉప్పల్ ఫ్లైఓవర్‌కు త్వరలో మోక్షం..?

ABN, Publish Date - Aug 04 , 2024 | 07:33 PM

ఉప్పల్ ఫ్లైఓవర్‌కు(Uppal flyover) త్వరలో మోక్షం..? లభించనుంది. ఫ్లైఓవర్ పనులు దాదాపు 6 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఉప్పల్ ఫ్లైఓవర్‌పై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది.

Uppal flyover

హైదరాబాద్: ఉప్పల్ ఫ్లైఓవర్‌కు(Uppal flyover) త్వరలో మోక్షం..? లభించనుంది. ఫ్లైఓవర్ పనులు దాదాపు 6 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఉప్పల్ ఫ్లైఓవర్‌పై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌ను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఉప్పల్‌ ఫ్లై ఓవర్ 6 ఏళ్లుగా పూర్తి కాక , గుంతల రోడ్లతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ ఉప్పల్ - నారపల్లి రూట్‌లో అనునిత్యం వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఫ్లై ఓవర్ పూర్తి కాక గుంతల రోడ్లు , ట్రాఫిక్ జామ్‌లతో వాహనదారుల అవస్థలు వర్ణానాతీతం.


ఎంతో ప్రతిష్టాత్మకంగా 2018 లో ప్రారంభించిన ఉప్పల్ ఎలివేటెడ్​ కారిడార్ పనులు నత్తనడక సాగుతున్నాయి. రూ. 670 కోట్లతో 6.2 కిలోమీటర్ల మేర హైదరాబాద్‌లో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ ఇది. ఉప్పల్ ఫ్లై ఓవర్‌కు శంకుస్థాపన చేసి 6 ఏళ్లు అవుతున్న పూర్తి కానీ ఫ్లైఓవర్ గా రికార్డుకెక్కింది. పిల్లర్లు దాటి ఒక్క అడుగు కూడా ఉప్పల్ , నారపల్లి ఫ్లై ఓవర్. ముందుకు పడలేదు. దీంతో ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లాలన్నా...ఘాట్ కేసర్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు వైపు రావాలన్న వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పైన ఫ్లై ఓవర్ పూర్తి కాక , కింద రోడ్డు వేయక వాహనదారుల అవస్థలు వర్ణనాతీతం. ఉప్పల్ నుంచి బొడుప్పల్, ఫీర్జాది గూడ, నారపల్లి వరకు రోడ్డుకు ఇరు వైపులా గుంతల ఉన్నాయి. గుంతలకు తోడు దుమ్ముతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఫ్లై ఓవర్ తర్వాత కానీ ముందు రోడ్డు వేయాలని వాహనదారులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు .అనునిత్యం భారీగా ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ. 30 కోట్లతో రోడ్డు మరమ్మతును తెలంగాణ సర్కార్ చేయనున్నది. ఇటీవల పాత కాంట్రాక్ట్ ను కేంద్రప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. కొత్తగా టెండర్‌కు కేంద్రం ఆహ్వానిచింది. ఇప్పటికైనా ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్‌కు మోక్షం వస్తుందనినగరవాసులు భావిస్తున్నారు.

Updated Date - Aug 04 , 2024 | 07:43 PM

Advertising
Advertising
<