BRS.. రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం ఆపాలి: హరీష్ రావు
ABN, Publish Date - Sep 29 , 2024 | 10:48 AM
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటి.. పేదలకు కనీస వసతులు కల్పించడమా... లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేయడమా.. అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబీ హటావో అంటారు కానీ గరీబోంకో హటావో అంటున్నారని మండిపడ్డారు. నగరంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని, రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్: హైడ్రా (Hydra) కూల్చివేతలతో (Demolitions) ఇళ్లను కోల్పోయిన వారి వద్దకు వెళ్లి బీఆర్ఎస్ నేతలు (BRS Leaders), ఎమ్మెల్యేలు (MLAs), ఎమ్మెల్సీ (MLC)లు పరిమర్శిస్తున్నారు. మరికాసేపట్లో బండ్లగూడ, హైదర్ షా కోట్ మూసి పరివాహక ప్రాంతాల్లో మాజీ మంత్రులు హరీష్ రావు (Harish Rao), సబిత ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy) ఆధ్వర్యంలో పరామర్శించనున్నారు. పార్టీ తరఫున, న్యాయపరంగా బాధితుల తరఫున తాము పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నేతలు హామీ ఇస్తున్నారు. హైడ్రాపై ప్రజా క్షేత్రంలోనే తేల్చుకోవాలని నేతలు నిర్ణయించారు. ఇదిలా ఉండగా వైరల్ ఫీవర్ కారణంగా ఎమ్మెల్యేల పర్యటనకు కేటీఆర్ దూరంగా ఉన్నారు.
నగరం లో బుల్డోజర్ రాజ్యం.. హరీష్ రావు
ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటి.. పేదలకు కనీస వసతులు కల్పించడమా... లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేయడమా.. అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబీ హటావో అంటారు కానీ గరీబోంకో హటావో అంటున్నారని మండిపడ్డారు. నగరంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని, రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం ఆపాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు డబ్బులు లేవని చెబుతున్నారని, ఏడు నెలల నుంచి పేద పిల్లలకు అన్నం పెట్టేందుకు డబ్బు లేదని అంటున్నారని, పెద పిల్లలకు అన్నం పెట్టేందుకు డబ్బులు లేవని చెబుతున్నారు కానీ మూసి ప్రక్షాళన కోసం లక్షన్నర కోట్ల రూపాయలు పెడతా మంటున్నారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు లేకుండా పోయాయని, రేవంత్ రెడ్డిది తుగ్లక్ పాలనలా .. పిచ్చోడి చేతిలో రాయి లా తయారైందని హరీష్ రావు అన్నారు. ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు .. ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డిమాండ్ చేశారు. హైడ్ర పేరుతో పేదల మెడమీద కత్తి పెట్టి ఖాళీ చేయిస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్‌పై దృష్టి పెట్టారని ఆరోపించారు. ఫార్మా సిటీని ఫోర్త్ సిటీ అని చెప్పి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా తయారు అయ్యారని విమర్శించారు. రూ. 1500 కోట్లతో డీపీఆర్ చేయిస్తాం అని చెబుతున్నారు.. రూ. 150 కోట్లు పెట్టి పేదలకు మందులు కొనలేరా అని ప్రశ్నించారు.
స్వచ్చంధంగా ఇల్లు ఇస్తే తీసుకోవాలి కానీ బలవంతంగా ఖాళీ చేయించకూడదని హరీష్ రావు అన్నారు. తాము ప్రారంభించిన ఎస్టీపీలు పూర్తవుతున్నాయని, మూసీలోకి గోదావరి నీరు ఎక్కడ నుంచి తెస్తారని నిలదీశారు. కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం కూలి పోయిందని అంటున్నారని, ఇప్పుడు అదే కాళేశ్వరం నుంచి నీరు తెచ్చి మూసీని నింపుతా మంటున్నారని, పేద వారు తెలంగాణ భవన్ అడ్రస్ వెతుక్కుంటూ మమ్మల్ని కాపాడండి అంటూ వచ్చారన్నారు. వారి బాధలు తమతో చెప్పుకున్నారని, అందుకే ఈరోజు వారికి భరోసా ఇచ్చేందుకు మూసి పరివాహక ప్రాంతంలో పర్యటిస్తున్నామని హరీష్ రావు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్‌పై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
72 అడుగుల డూండీ గణేష్ నిమర్జనం
గచ్చిబౌలి స్టేడియంలో ‘పింక్ పవర్ రన్ 2024’
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 29 , 2024 | 10:48 AM