HARISH RAO: కాంగ్రెస్ పాలనలో భద్రత లేదు.. హరీష్‌రావు ధ్వజం
ABN, Publish Date - Nov 08 , 2024 | 08:00 PM
కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు భద్రత లేదని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కేసీఆర్ ఏ లేకపోతే తెలంగాణ వచ్చునా? తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రివి అయ్యేవాడివా? అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
సిద్దిపేట: దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీని, తెలంగాణకు స్వతంత్రం తెచ్చిన కేసీఆర్‌ను ప్రజలు మర్చిపోరని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో ఇవాళ(శుక్రవారం) సీఎంఆర్ఎఫ్ సాయంలో భాగంగా 237 మందికి రూ.54.50 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ... రేవంత్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని హరీష్‌రావు విమర్శించారు.
రేవంత్ ప్రభుత్వంలో రైతుబంధు నిధులు ఆలస్యం, కేసీఆర్ హయాంలో రైతులకు సత్వర సాయం అందిందని కానీ.. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అంతరాయం ఏర్పడిందని మండిపడ్డారు. అవ్వ తాతలకు రేవంత్ రెడ్డి సర్కారు రెండు నెలల పెన్షన్ ఎగ్గొట్టిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని చెబితే, ప్రజలు నవ్వుకుంటున్నారని హరీష్‌రావు అన్నారు.
అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? తెలంగాణ రాకపోతే రేవంత్ ముఖ్యమంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు. 11 నెలల రేవంత్ పరిపాలనలో పేదవారికి ఒక్క ఇల్లు అయినా కట్టించారా అని ప్రశ్నించారు. కూలగొట్టడం తప్పా ఈ ప్రభుత్వానికి ఇంకా ఏం తేలీదని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో 15 రోజుల్లో నాలుగు గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ప్రమాదాలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు భద్రత లేదని హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
CM Revanth Reddy: యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు
Bandi sanjay: తెలంగాణలో యాక్టివ్ సీఎం కేటీఆరే.. బండి సెన్సేషనల్ కామెంట్స్
KTR: మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 08 , 2024 | 08:07 PM