Shamshabad Airport: వామ్మో ఎంత బంగారమో...!
ABN, Publish Date - Mar 04 , 2024 | 09:57 AM
Telangana: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమ బంగారం పట్టివేత షరా మామూలైపోయింది. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే కొందరు ప్రయాణికులు అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు యత్నిస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కుతుంటారు. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలో కిలోల కొద్దీ బంగారం పట్టుబడుతూనే ఉంది.
హైదరాబాద్, మార్చి 4: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Shamshabad Airport) అక్రమ బంగారం (Gold) పట్టివేత షరా మామూలైపోయింది. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే కొందరు ప్రయాణికులు అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు యత్నిస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కుతుంటారు. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలో కిలోల కొద్దీ బంగారం పట్టుబడుతూనే ఉంది. అక్రమ బంగారం తరలింపును కట్టడి చేసేందుకు అధికారులు, పోలీసులు అనేక చర్యలు చేసినప్పటికీ ప్రయాణికులు మాత్రం ఏదో రకంగా బంగారాన్ని తరలిస్తున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు.. దాదాపు13.65 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. సదరు బంగారం విలువ రూ.6.03 కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స అధికారులు అంచనా వేశారు. బంగారం తరలిస్తున్న ప్రయాణికులను అదుపులోకి తీసుకొన్న కస్టమ్స్ అధికారులు విచారణ చేపట్టారు.
ఒక్క ఫిబ్రవరిలోనే...
మరోవైపు ఫిబ్రవరి నెలలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పెద్దఎత్తున బంగారం పట్టుబడింది. ఒక్క నెలలోనే రూ.6 కోట్ల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొచ్చిన ప్యాసింజర్లు... కస్టమ్స్‌కు దొరికిపోయారు. మొత్తం 28 కేసుల్లో 13.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివిధ రకాలుగా బంగారాన్ని ప్రయాణికులు అక్రమంగా తీసుకొచ్చారు. మొత్తం ముగ్గురిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేసి విచారణ జరిపారు.
ఇవి కూడా చదవండి...
TS Politics: బీఆర్‌ఎస్‌లో పోటీకి సిటింగ్‌లు విముఖం?.. బీఆర్ఎస్‌లో అనూహ్య పరిస్థితులు
AP News: బిడ్డా.. కొట్టొద్దురా! అని వేడుకున్నా వినకుండా..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 04 , 2024 | 12:43 PM