ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన పలు కాలనీలు

ABN, Publish Date - Sep 21 , 2024 | 08:04 PM

భాగ్యనగరంలో భారీ వర్షం పడుతోంది. నగరంలో కుండపోతగా వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం ధాటికి లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతోంది.

Rains At Hyderabad

హైదరాబాద్‌: భాగ్యనగరంలో భారీ వర్షం పడుతోంది. నగరంలో కుండపోతగా వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం ధాటికి లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతోంది. వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోయారు.


కోఠి, బషీర్‌బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోరి, నారాయణగూడ, ముషీరాబాద్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, ఉప్పల్, ఎల్‌బీ నగర్, కంటోన్మెంట్, నాగోల్, తార్నాక, నాంపల్లి, లక్డీ కపూల్, బంజారా‌హిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్ఆర్‌నగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇక ఆఫీస్‌ల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. వర్షం కారణంగా ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు.నగర వ్యాప్తంగా మరో గంట పాటు భారీ వర్షం కురుస్తుందని వాతావరణ వాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు జీహెచ్ఎంసీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఎవరు బయటికి రావద్దంటూ జీహెచ్ఎంసీ హెచ్చరించింది.

Updated Date - Sep 21 , 2024 | 09:08 PM